బీజేపీలో మ‌రో నేత పాద‌యాత్ర‌.. పెరుగుతున్న వ‌ర్గ విభేదాలు..

బీజేపీ అంటే స‌మిష్టిగా కొట్లాడుతుంని, ఏ నిర్ణ‌య‌మైనా అంద‌రూ క‌లిసే తీసుకుంటార‌ని ఇంత‌కు ముందు ఎన్నోసార్లు నిరూపించారు మ‌న రాష్ట్ర నేత‌లు.ఎవ‌రిని పార్టీ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించాన స‌రే అంద‌రూ క‌లిసి స‌హ‌కరించేవారు.

 Another Leaders March In Bjp Growing Communal Differences, Bjp, Vivek, Bjp Core-TeluguStop.com

అధ్య‌క్షుడు చె్పిన‌ట్టే అంద‌రూ న‌డుచుకునేవారు.ఎవ‌రు కూడా పార్టీ లైన్ దాటేవారు కాదు.

ఇంకా చెప్పాలంటే అధ్య‌క్షుడు తీసుకున్న ఏ నిర్ణ‌య‌మైనా స‌రే సీనియ‌ర్ల ద‌గ్గ‌రి నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు అంద‌రూ న‌డుం బిగించి స‌క్సెస్ చేసేవారు.అలాంటి బీజేపీలో ఈ మ‌ధ్య కొన్ని వ‌ర్గ విభేదాలు చాలా స్ప‌ష్టంగా క‌న‌పిస్తున్నాయి.

ఇక ఈట‌ల రాజేంద‌ర్ రాక‌తో ఆ విభేదాలు కాస్త బ‌య‌ట ప‌డ్డ‌ట్టు క‌నిపించాయి.బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకు ఈట‌ల‌ను బీజేపీలోకి కిష‌న్ రెడ్డి తీసుకు వ‌చ్చార‌ని చ‌ర్చ మొద‌టి నుంచి సాగుతుండ‌గా.

ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌కు బండి సంజ‌య్ ఫుల్ స‌పోర్టు చేస్తుండ‌టంతో కిష‌న్ రెడ్డికి షాక్ త‌గిలిన‌ట్ట‌యింది.ఇక ఇప్పుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీంతో త‌న ఇమేజ్ ఎక్క‌డ త‌గ్గుతుందో అని కిష‌న్ రెడ్డి కూడా ఆశీర్వాద యాత్ర‌ను మొద‌లు పెట్టారు.బీజేపీలో ఇలా ఇద్ద‌రు పాద‌యాత్ర‌లు చేయ‌డం ఇదే మొద‌టిసారి.

Telugu Bandi Sanjay, Bjp, Etela Rajender, Kishan Reddy, Vivek, Vivekvenkata-Poli

దీంతో వారి మ‌ధ్య ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టేన‌ని అనిపిస్తోంది.ఇక ఇప్పుడు బీజేపీ కోర్ క‌మిటీ లీడ‌ర్ అయిన వివేక్ వెంక‌ట‌స్వామి కూడా పాద‌యాత్ర‌ను చేప‌ట్టారు.అదేంటంటే కాళేశ్వ‌రం ముంపు బాధితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించేందుకు ఆయ‌న పోరుయాత్ర‌ను ప్రారంభించారు.అయితే ఇది ఆయ‌న స్వంతంగా స్టార్ట్ చేయ‌కున్నా మంచిర్యాల జిల్లా సెక్ర‌ట‌రీ చేస్తున్న పాద‌యాత్ర‌కు ఆయ‌న స‌పోర్టు చేస్తున్నారు.

మొత్తానికి బీజేపీలో కూడా కాంగ్రెస్ లాగే ఎవ‌రికి వారే పాద‌యాత్ర‌లు మొద‌లు పెట్టేస్తున్నారు.చూడాలి ముందు ముందు ఇంకెలా ఉంటాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube