కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్న మరో నేత.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళిత బంధుస్కీమ్‌ను తెరమీదకు తెచ్చిన సంగతి అందరికీ విదితమే.ఈ పథకం ద్వారా దళిత జాతిలో వెలుగు నింపడమే కేసీఆర్ లక్ష్యమని గులాబీ నేతలు పేర్కొంటున్నారు.

 Another Leader Supporting Kcr .. Shouldn't Congress Be Shocked?,  Revanth, Surve-TeluguStop.com

అయితే, విపక్ష నేతలు, కొందరు మేధావులు ఇది కేవలం ఎన్నికల తాయిలమని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దళిత బంధు’ స్కీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

ఆయన ఎవరు? రేవంత్ నాయకత్వంపై ఏ విధంగా స్పందించారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.

తెలంగాణలో సుమారు కోటి మంది దళితులు ఉన్నారని, 25 లక్షల కుటుంబాలు ఉన్నాయని వారికి మేలు చేసేందుకు ‘దళిత బంధు’ ఉపయోగపడుతుందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన పై వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ స్కీమ్‌కు మద్దతు పలకడం ద్వారా టీపీసీసీ చీఫ్ రేవంత్ నాయకత్వాన్ని సపోర్ట్ చేయడం లేదనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో షురూ అయింది.

ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌‌కుతట్టిందని, కుటుంబానికి రూ.పది లక్షలిచ్చి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని కేసీఆర్‌ను సర్వే పొగిడారు.సీఎం ఆలోచనను అందరూ స్వాగతించాలని కోరారు.

Telugu Huzurabad, Pcc, Revanth, Satyanayana, Sathya Yana, Ts Congress, Ts Poltic

పైగా ఈ విషయమై రాజకీయాలు చేయడం సరికాదని సత్యనారాక్ష్న అభిప్రాయపడ్డారు.ఈ పథకం తెరమీదకు వచ్చాకే అందరూ దళితుల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.ఈ క్రమంలోనే తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అయితే, తాను కొంత యాక్టివ్‌గా లేనని పేర్కొన్నారు సర్వే.ఇకపోతే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం వచ్చిందని పేర్కొనడం గమనార్హం.అయితే, కాంగ్రెస్ పార్టీలోని ఇతర సీనియర్ నేతల మాదిరి సర్వే సత్యనారాయణ కూడా రేవత్ నాయకత్వానికి సపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

మొత్తంగా రేవంత్‌కు భవిష్యత్తులో సర్వే సత్యనారాయణ మద్దతు ఇస్తారా? లేదా షాక్ ఇస్తారా? అనేది కొంత కాలం తర్వాతే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube