వైసీపీలో మ‌రో రెడ్డికి కీల‌క ప‌ద‌వి... జ‌గ‌న్ బంధుప్రీతికి బ్రేకుల్లేవా ..!

ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల హ‌వానే ఎక్కువుగా న‌డుస్తుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.ప‌లు కీల‌క ప‌ద‌వులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఉన్నారు.

 Another Key Position For Another Reddy In Ycp ... No Breaks For Jagan Kinship, A-TeluguStop.com

ఇక నిధులు.క‌నీసం ఆఫీసులు కూడా లేని ప‌లు కార్పొరేష‌న్ ప‌ద‌వులు బీసీల‌కు క‌ట్ట‌బెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వులు రెడ్డి సామాజిక వ‌ర్గం వారికే క‌ట్ట‌బెడుతోన్న ప‌రిస్థితి ఉంది.

ఆ మాట‌కు వ‌స్తే టీడీపీ హ‌యాంలోనూ ప‌లు కీల‌క మంత్రి ప‌ద‌వులు, ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వులు అన్నీ చంద్ర‌బాబు త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌మ్మ వ‌ర్గానికే క‌ట్ట‌బెట్టారు.

చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో క‌మ్మ‌ల‌కే అన్ని అన్న టాక్ ఎక్కువై టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.

తాజాగా మ‌రో రెడ్డి నేత‌కు జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పున్నూరు గౌతంరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్ర‌స్తుతం ఏపీలోని అన్ని విలేజ్‌ల‌కు అండ‌ర్ గ్రౌండ్ కేబుల్స్ వేసి ఇంట‌ర్నెట్ ఇస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు.ఇందుకు భారీగా నిధులు కేటాయించాలి.

ఈ క్ర‌మంలోనే ఇవ‌న్నీ కంట్ర‌ల్లో ఉండే ఏపీ పైబ‌ర్ నెట్ అధ్య‌క్ష ప‌ద‌విని త‌న బంధువు అయిన గౌతంరెడ్డికి ఇచ్చార‌న్న టాక్ వ‌చ్చేసింది.

Telugu Ap, Ap War, Hot Topic, Jagan, Key, Latest, Reddy, Ysrcp-Telugu Political

ఇక గౌతంరెడ్డి జ‌గ‌న్ భార్య భార‌తీ రెడ్డికి స‌మీప బంధువు.గ‌తంలో క‌మ్యూనిస్టు పార్టీలో ఉండే ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు చేతిలో ఓడిపోయారు.2019 ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు.అయితే వైసీపీలో ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు.వైఎస్ఆర్ టీయూసీ అనే అనుబంధ సంఘానికి అధ్యక్షుడు. కార్మిక నాయకుడిగా మంచి పేరే ఉంది.అయితే గ‌తంలో వంగ‌వీటి రంగాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి విమ‌ర్శ‌ల పాల‌య్యారు.

ఆ త‌ర్వాత రాధాను సంతృప్తి ప‌రిచేందుకు జ‌గ‌న్ గౌతంరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్టు కొద్ది రోజులు షో న‌డిపించి.మ‌ళ్లీ  పార్టీలోకి తీసుకున్నారు.ఇక ఇప్పుడు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.ఏదేమైనా జ‌గ‌న్ బంధువుల‌కు ప‌ద‌వులు ఎక్కువ అవ్వ‌డంతో వైసీపీ వ‌ర్గాల్లోనే కొత్త చ‌ర్చ మొద‌లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube