మరో ఉసేన్ బోల్ట్... శ్రీనివాస్ గౌడ రికార్డ్ బ్రేక్

మట్టిలో మాణిక్యాలు అనే మాట తరుచుగా వింటూ ఉంటాం.గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారిలో చాలా ప్రతిభ దాగి ఉంటుంది.

 Another Kambala Racer Has Created A Record In 100 Meters-TeluguStop.com

అలాంటి ప్రతిభని గుర్తించి సాన బెడితే ఇండియాన్ని క్రీడలలో ఎవరు ఆపలేరు.అయితే భారతీయ క్రీడలలో రాజకీయాలు ఎక్కువ.

ఇక్కడ కూడా ప్రతిభకి ఎవరో ఒకరు అడ్డు పడుతూనే ఉంటారు.క్రీడాకారులని ఎంపిక చేసే వారిలో ఉన్న ప్రముఖులు ప్రతిభ ఆధారంగా కాకుండా ఫైనాన్సియల్ స్టేటస్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ఎంపిక చేస్తూ ఉంటారు.

ఈ కారణంగానే క్రీడలలో భారత్ వెనుకబడిపోతుంది.అయితే ఈ విషయం అందరికి తెలిసిన కూడా ప్రక్షాళన చేసే దిశగా ఎవరు అడుగులు వేయరు.

ఈ కారణంగానే ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులు కేవలం రైల్వే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి పరిమితం అయిపోతున్నారు.కొందరు పేదరికంతో కుటుంబ భారం మోస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో జరిగే కంబళ పోటీలలో ఉసేన్ బోల్ట్ రికార్డ్ ని శ్రీనివాస గౌడ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.దీంతో అతను ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.

క్రీడామంత్రిత్వ శాఖ కూడా అతనిని రన్నింగ్ ట్రైల్స్ కి పిలిచింది.ఈ శ్రీనివాస్ ని మరువకముందే స్టార్ ఈ రోజు తెరపైకి వచ్చాడు.

కర్నాటకలో జరుగుతున్న కంబళ పోటీల్లో మరో వరల్డ్ రెకార్డ్ నమోదైంది.తాజాగా నిశాంత్ శెట్టి అనే యువకుడు అతని రికార్డ్ ని బ్రేక్ చేశారు.జగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ ఈ కంబాళ పోటీలలో 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు.అంటే 100 మీటర్ల పరుగును 9.51 సెకన్లలోనే పూర్తి చేసాడు.ఇది ఉసేన్ బోల్ట్, శ్రీనివాస రికార్డ్ కంటే బెస్ట్ అని చెప్పాలి.మరి ఇతనికి క్రీడామంత్రిత్వ శాఖ ఎంత వరకు గుర్తింపు ఇస్తుంది అనేది ఇప్పుడు చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube