మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'!

Another International Award Won By RRR Movie, RRR, International Award, Rajamouli, Ram Charan, NTR, Rotten Tomatoes , Tollywood

ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వినిపిస్తున్న పేరు ఆర్ఆర్ఆర్వరల్డ్ వైడ్ గా మన టాలీవుడ్ సినిమా రౌద్రం రణం రుధిరం అనేక రికార్డులను క్రియేట్ చేసింది.ఎన్నో అవార్డులను సైతం అందుకుంటున్న ఈ సినిమా తెలుగు ఖ్యాతిని మాత్రమే కాదు.

 Another International Award Won By Rrr Movie, Rrr, International Award, Rajamoul-TeluguStop.com

ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణంగా నిలిచింది అనే చెప్పాలి.అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.

ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో ఎలరించిన ఈ సినిమా ఎన్నో అద్భుతాలను అందుకుంటుంది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఆస్కార్ కు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.ఆస్కార్ కంటే ముందే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.

వరల్డ్ పాపులర్ రివ్యూ సంస్థ అయినటువంటి రోటెన్ టొమేటోస్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాకు 2022 ఫ్యాన్ ఫెవరెట్ చిత్రంగా అవార్డు ప్రకటించింది.దీంతో మన తెలుగు సినిమాకు మరో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది.

సోషల్ మీడియా వేదికగా రోటెన్ టొమేటోస్ వారు ఈ విషయాన్నీ ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ విషయం ఇప్పుడు ఫ్యాన్స్ ను మరోసారి ఆనందానికి గురి చేసింది.మరి మన ఆర్ఆర్ఆర్ సినిమా ముందు ముందు ఇంకెన్ని అవార్డులను గెలుచుకుంటుందో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube