బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో నాగార్జున ఇంటి ముందు 20 మంది పోలీసులు  

Another Interesting Update From Host Nagarjuna Akkineni-

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుంది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సీజన్‌ 3 ప్రారంభంకు ముందు చాలా పెద్ద రచ్చ జరుగుతుంది.మొదటి రెండు సీజన్‌లకు కూడా వివాదాలు వచ్చాయి.కాని మరీ ఈ స్థాయిలో మాత్రం వివాదాలు రేగలేదు.కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం బిగ్‌బాస్‌ను అంటుకోవడంతో కోర్టు కేసులు, పోలీసు కేసులు నమోదు అవ్వడం జరిగింది.

Another Interesting Update From Host Nagarjuna Akkineni- Telugu Tollywood Movie Cinema Film Latest News Another Interesting Update From Host Nagarjuna Akkineni--Another Interesting Update From Host Nagarjuna Akkineni-

ఇదే నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పై సీరియస్‌గా ఉన్నాయి.

ఇంత వివాదం జరుగుతుంటే నాగార్జున పట్టించుకోవడం లేదని, సమాజంలో పెద్దమనిషిని అంటూ చెప్పుకునే నాగార్జున ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై నాగార్జున ఇంటిని ముట్టడించేందుకు సిద్దం అవుతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలో పోలీసులు నాగార్జున ఇంటికి భద్రత కల్పించడం జరిగింది.ప్రైవేట్‌ సెక్యూరిటీతో పాటు దాదాపు 20 మంది పోలీసులు కూడా నాగార్జున ఇంటిని పహారా కాస్తున్నారు.

మొత్తానికి నాగార్జున బిగ్‌బాస్‌లో అడుగు పెట్టగానే వివాదాలు చాలా పెద్దగా అవుతున్నాయి.ఇది షోకు ప్లస్‌ అవుతుందా మైనస్‌ అవుతుందా అనేది చర్చనీయాంశంగా ఉంది.

ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 3 సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.అక్కడ కూడా పోలీసులు మరియు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులతో సెక్యూరిటీ ఇస్తున్నారు.ప్రారంభం అయిన తర్వాత మొదలవ్వాల్సిన వివాదం ఇప్పుడే రావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.