కుప్పం వేదిక‌గా మ‌రో ఆస‌క్తిక‌ర పోరు..

ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు ప‌రిస్థితి ఉనికిని చాటుకుంటే చాల‌న్న‌ట్టు త‌యార‌యింది.ఆయన పార్టీ వ‌రుస‌గా జ‌రుగుత‌న్న అన్ని ఎన్నిక‌ల్లోనూ దారుణంగా ఓడిపోతూనే ఉంది.

 Another Interesting Fight Between Tdp And Ycp In Kuppam Municipality Elections,-TeluguStop.com

దీంతో అస‌లు పార్టీలో ఎవ‌రైనా ఉంటారా అనే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.ఇక ఈ త‌రుణంలోనే చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై కూడ న‌మ్మ‌కం పోతోంద‌ని సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నారు.

ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుకు మ‌రో పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.అదే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌లు.

ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీ చాలా సీట్లో కోల్పోయిది.

మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌రిస్థితి ఇలా త‌యార‌యింది.

దీంతో ఆయ‌న మీద అంద‌రికీ న‌మ్మ‌కం స‌డులుతోంద‌నే వాద‌న ఓ వ‌ర్గం బ‌లంగా వినిపిస్తోంది.ఇది చాల‌ద‌న్న‌ట్టు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నిక‌లు ఆయ‌న‌కు పెద్ద స‌వాలుగా మారిపోయాయి.

గ‌తంలో రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా పడ్డ ప్రాంతాల‌కు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.వీటికి సంబంధిచిన నోటిఫికేషన్ 23వ తేదీన రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది.

గతంలో వాయిదా ప‌డ్డ పన్నెండు మునిసిపాలిటీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గమే హాట్ కేక్‌లా మారిపోయింది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Kuppam, Tdp Ycp-Telugu Political News

కుప్పం నియోజ‌క‌వ‌ర్గం తొలిసారి మున్సిపాలిటీగా మారింది.అంత‌కుముందు దీనికి మున్సిపాలిటీగా కాకుండా కేవ‌లం స్థాన‌క సంస్థ‌గానే ప‌రిగ‌ణించేవారు.కానీ ఇప్పుడు మున్సిపాలిటీ చేసి ఆ క్రెడిట్ కొట్టేసిన వైసీపీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తాము గెల‌వాల‌నే ప‌ట్టు మీద ఉంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన వైసీపీ ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టు నిలుపుకోవాల‌ని చూస్తోంది.ఇదే జ‌రిగితే ఇక చంద్ర‌బాబు ప‌రిస్థితి ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే.అందుకోస‌మే చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే ఈ ఎన్నిక‌ల కోసం అన్నీ తానే స్వయంగా చూసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube