కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం

వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ విక్రయించరని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

 Another Important Decision Of The Delhi Government To Reduce Pollution-TeluguStop.com

కాగా ఈ విధానం అక్టోబర్ 25 నుంచి అమల్లోకి రానుందని చెప్పారు.త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి వాహనాలు కూడా ఒక కారణమని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే కాలుష్యం ఉన్న వాహనాలు రోడ్లపై తిరగకుండా నిరోధించే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

గతంలోనూ కాలుష్య నివారణకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సరి -బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube