సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎంట్రీ  

Another hero from the Superstar family, Tollywood, Star Kids, Celebrity Family Heroes, Super Star Mahesh Babu, Vijay Nirmala - Telugu Celebrity Family Heroes, Star Kids, Super Star Mahesh Babu, Superstar Family, Tollywood, Vijay Nirmala

చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీ కుటుంబాల నుంచి వారసులు రావడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది.అయితే ఇలా వారసులుగా వచ్చిన వారిలో అందరూ స్టార్ హీరోలు కాలేరు.

TeluguStop.com - Another Hero From The Superstar Family

కొంత మంది మాత్రమే తమని తాము ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోల రేంజ్ కి వెళ్తారు.లేదంటే ఏదో ఎవరేజ్ హీరోలుగా మిగిలిపోతారు.

కొంత మంది పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోతారు.అలా వచ్చినవారిలో తారకరత్న, తరుణ్, వడ్డే నవీన్ లాంటి హీరోలు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారో అందరికి తెలిసిందే.

TeluguStop.com - సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది హీరోలు వచ్చారు.వారిలో అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీ బ్రాండ్ ని కూడా సొంతం చేసుకోలేకపోయాడు.

ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వారసులుగా మహేష్ బాబు వచ్చి నెంబర్ వన్ హీరో అయిపోయాడు.

ఆ ఫ్యామిలీ నుంచి సుదీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడుగా ప్రూవ్ చేసుకున్నా సోలోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అలాగే విజయ నిర్మల మనవడు, సీనియర్ హీరో నరేష్ కొడుకు నవీన్ హీరోగా వచ్చిన రెండు సినిమాలకే పరిమితం అయ్యాడు.ఇప్పుడు కృష్ణ కూతురు కొడుకు గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరోగానే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు.

విజయ నిర్మల అన్న మనవడు శరన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

శరన్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు రామ్ చంద్ర వట్టికుటి దర్శకత్వం వహించబోతున్నాడు.శ్రీలత వెంకట్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది.మరి ఈ కుర్ర హీరో ఎంత వరకు టాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు అనేది చూడాలి.

#Star Kids #CelebrityFamily #SuperStar #Vijay Nirmala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Another Hero From The Superstar Family Related Telugu News,Photos/Pics,Images..