క్రేజీ ప్రాజెక్టు లో అవకాశం దక్కించుకున్న థమన్!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.ఈ ప్రాజెక్ట్ అలా అనౌన్స్ చేసారో లేదో అప్పటి నుండి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది.

 Another Gossip In Ram Charan Shankar Project, Ram Charan, Shankar, S. Thaman,sha-TeluguStop.com

ప్రస్తుతం మరొక గాసిప్ మొదలయ్యింది.ఈ సినిమాలో సౌత్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ముందుగా ఈ ప్రాజెక్ట్ లో అనిరుద్ పేరు వినిపించింది.కానీ ఇప్పుడు థమన్ పేరు తెరపైకి వచ్చింది.ఇప్పటికే తెలుగు, తమిళ్ తో పాటు మరికొన్ని బాషలలో కూడా మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు.అయినా థమన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా బిజీగా ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ ను అంగీకరిస్తూ దేవి శ్రీ ప్రసాద్ కు పోటీ ఇస్తున్నాడు.

ఇప్పుడు వస్తున్నా గాసిప్ నిజమయితే సౌత్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నిలుస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు ఈ సినిమాలో థమన్ ఓకే అయితే ఆయన సంగీతం అందించిన అతిపెద్ద ప్రాజెక్ట్ గా ఇది నిలిచిపోతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ మరొక ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టాడు.

శంకర్ కూడా ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే రామ్ చరణ్ శంకర్ సినిమా స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube