వాట్సాప్ యాప్ లో మరో అద్భుతమైన ఫీచర్!

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ లో ఎక్కువ మంది ఉపయోగించే యాప్ వాట్సాప్.మన దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు.

 Another Good News For Whats App India Users Whats App, Messageing App, Distracti-TeluguStop.com

ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్ ను అతి త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొనిరావడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది.

కొన్ని రోజుల క్రితం ఇతరులు వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించకుండా ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.వాట్సాప్ తెస్తున్న ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉండటంతో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులకు అవతలి వ్యక్తులకు పంపించిన సందేశాలను నిర్ణీత సమయం తర్వాత డిలేట్ చేసే అవకాశం ఉంది.

ఈ ఫీచర్ ద్వారా పొరపాటున అవతలి వ్యక్తులకు సందేశాలు పంపినా, అవతలి వ్యక్తులు చదివిన తరువాత ఆ మెసేజ్ డిలేట్ చేసే అవకాశం ఉంది.

అయితే వాట్సాప్ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్ ద్వారా అవతలి వాళ్లకు పంపిన మెసేజ్, ఇమేజ్, వీడియోలు ఎప్పుడు డిలేట్ చేయాలో ఎంచుకోవచ్చు.టైమర్ ద్వారా టైమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సమయానికి మెసేజ్ ఆటోమేటిక్ గా మనకు, అవతలి వ్యక్తులకు డిలేట్ అయిపోతుంది.

ఇప్పటికే కొన్ని యాప్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా వాట్సాప్ త్వరలో ఈ ఫీచర్ ను తీసుకురానుంది.చాట్ చేసి బయటకు వచ్చిన తరువాత చాట్ అంతా డిలేట్ అయ్యే విధంగా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

వాట్సాప్ మొదట ఈ ఫీచర్ ను బీటా యూజర్లకు ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube