మార్కెట్లోకి కొత్తగా ప్రాణాంతక వైరస్ లను చంపేయగల మరో గాడ్జెట్..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వలన ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు మన డాక్టర్స్, శాస్త్రవేత్తలు.

 Another Gadget That Can Kill The Deadly Corona Viruses New To The Market,  Air P-TeluguStop.com

అయితే ఇప్పుడు మనల్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్ వంటి ప్రాణాంతకర వైరస్ లను చంపేయగల గాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.అదేంటంటే.

వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనే పరికరం.ఈ పరికరాన్ని ధరించినవారు పీల్చే గాలిలో 99శాతం కంటే ఎక్కువ వైరస్, బ్యాక్టీరియాలను చంపేయవచ్చు అన్నమాట.

ఈస్టోనియన్ టెక్ కంపెనీ అయిన ” రెస్పిరే “ఈ డివైజ్ ను రిలీజ్ చేసింది.ఈ డివైజ్‌ ను ఈస్టోనియన్ విద్యా మంత్రిత్వ శాఖ మద్దతుతో ఎస్టోనియా పోలాండ్‌ లోని యూనివర్శిటీలో డెవలప్ చేశారు.

ప్రస్తుతానికి మనకు వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు.కానీ, ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఈ డివైజ్ ఎంతో సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ శ్వాస థర్మోడైనమిక్స్ మీద ఆధారపడి పనిచేస్తోందని చెబుతోంది.ఈ డివైజ్ ఒక ప్లాస్టిక్ బాక్సును కలిగి ఉంటుంది.

దీన్ని మెడ చుట్టూ ధరించవచ్చు.అలాగే ఇది ఒక బ్యాటరీ సహాయంతో పనిచేస్తుందట.

అలాగే ఈ పరికరాన్ని ఒక సారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు వర్క్ అవుతుంది.

Telugu Air Filter, Corona, Covid, Estonia, Gadget, Poland, Respiro Company, Puri

అలాగే మనం పీల్చిన గాలి ఫీల్టర్ అయి లోపలకు వెళ్తుంది.అంతేకాకుండా ఈ పరికరం గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలను కూడా తొలగిస్తుంది.UV-C ఎల్ఈడీ మాడ్యూల్ ద్వారా వెళ్తుంది.

వైరస్, బ్యాక్టీరియాను చంపేస్తుంది.పోలాండ్‌లోని లాడ్జ్ యూనివర్శిటీలో నిర్వహించిన పరీక్షల్లో E.coli, S.aureus అనే బ్యాక్టీరియాలపై 99% పైగా నిర్మూలించినట్టు కంపెనీ వెల్లడించింది.ఎస్టోనియన్ రిటైలర్లు డివైజ్ కోసం ఆర్డర్లు ఇచ్చారని, మార్చిలో డెలివరీలు ప్రారంభమవుతాయని రెస్పిరే చెప్పారు.దీని రిటైల్ ధరలు 279 యూరోలుగా కంపెనీ నిర్ణయించింది.అయితే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ డివైజ్‌ను ముందుగా స్కూళ్లలో ఉపాధ్యాయులకు పంపిణీ చేయనున్నట్టు కంపెనీ రెస్పిరే వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube