ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాని వాడుకుని కొందరు కొన్ని రకాల ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ఇందులో నగరంలో టాక్సీ నడిపేటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ టాక్సీ లో నూ కండోమ్ ప్యాకెట్ ని తప్పనిసరిగా ఉంచుకుంటున్నారు.అయితే ఇలా ఎందుకు చేస్తున్నారని కొందరు వ్యక్తులు టాక్సీ డ్రైవర్లను అడిగితే తమ తోటి డ్రైవర్లు టాక్సీలో కండోమ్ ప్యాకెట్ ఉంటే పోలీసులు జరిమానా విధించరని చెప్పారని అందువల్ల తాము నడిపే టాక్సీ లలో కండోమ్ ప్యాకెట్లు తప్పనిసరిగా ఉండేట్లు చూసు కుంటున్నామని వెల్లడించారు.
ఈ విషయం ఈ నోట ఆ నోట పాకడంతో టాక్సీ డ్రైవర్లు అందరూ కండోమ్ ప్యాకెట్లు కోసం మెడికల్ షాపు ముందు బారులు తీరుతున్నారు.అంతేకాక ఒక్కొక్కరూ డజను, అరడజను పైగా కండోమ్ ప్యాకెట్లు కొని టాక్సీలో ఉంచుకుంటున్నారు.
దీంతో కొందరు పత్రికా విలేకరులు ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులను అడగా నగరంలోని టాక్సీ డ్రైవర్లకు ఎవరో తప్పుడు సమాచారం అందించారని అన్నారు.అంతేకాక వాహనంలో కండోమ్ ప్యాకెట్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఏమీ లేదని అన్నారు.
అంతేగాక ఇప్పటివరకు వాహనంలో కండోమ్ ప్యాకెట్ లేదన్న కారణంగా డ్రైవర్లకు ఎటువంటి చలాన విధించలేదని అన్నారు.