హైదరాబాద్ బయోఫోర్ నుండి కరోనాకి మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు..!

కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు మరో కొత్త ఔషధాన్ని కనిపెట్టారు హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్.కరోనా ట్రీట్మెంట్ లో ఈ సంస్థ అవిప్టాడిల్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

 Another Emergency Medicine Aviptadil From Biophore Drug Controller-TeluguStop.com

ఈ ఔషధ వినియోగ అనుమతుల కోసం భారత ఔషధ నియత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.బయోఫోర్ అభివృద్ధి చేసిన వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ పెప్డైడ్ (వీఐపీ) అయిన అవిప్టాడిల్ కరోనా బాధిఉలకు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినీల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీ.ఈ.ఓ డాక్టర్ జగదీష్ బాబు చెప్పారు.ఇదే కంపెనీ నుండి ఇదివరకు ఫావిపిరావిర్ ఔషధాన్ని అందించారు.

 Another Emergency Medicine Aviptadil From Biophore Drug Controller-హైదరాబాద్ బయోఫోర్ నుండి కరోనాకి మరో ఔషధం.. డీజీసీఐకి దరఖాస్తు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు అవిప్టాడిల్ అనే ఔషధాన్ని ఏర్పాటు చేశారు.కరోనా బాధితులకు ఇది సమర్ధవంతంగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

అయితే జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ అన్ని పూర్తయితే తప్పకుండా ఈ ఔషధానికి కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే కరోనా కోసం చాలా రకాల మందులు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి.

వాటితో పాటుగా ఈ ఔషధం కూడా త్వరలో అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని రానుంది.

#Corona #Biophore #Drug Controller #AViptadil #COvid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు