తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. దాని ఫీచర్లు ఇవే!

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి డిమాండ్ పెరుగుతున్న వేళ చాలా కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేస్తున్నాయి.అందులో భాగంగా తాజాగా బెంగుళూరులోని స్టెల్లా మోటో కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది.స్టెల్లా మోటో కంపెనీ ‘బజ్ ‘ పేరుతో భారత విపణలోకి ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ రూ.95,000గా నిర్ణయించారు.బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రే, మ్యాట్ బ్లూ,రెడ్, బ్రౌన్ కలర్స్ అనే 4 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.ఈ స్కూటర్ మంచి డిజైన్‌తో కొత్త కొత్త ఫీచర్స్‌తో, మూడేళ్ల వారంటీతో వస్తుంది.

 Another Electric Scooter Launch At A Low Price  Its Features Are These ,buzz Ele-TeluguStop.com

బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ హెడ్ లైట్, బ్యాక్ లైట్, అల్లాయ్ రిమ్డ్ వీల్స్ ప్రత్యేకంగా తయారు చేశారు.అంతేకాకుండా ఈ స్కూటర్‌లో ఎ గ్రేడ్ లిథియం ఐరన్ పాస్పెట్ బ్యాటరీ అందించారు.

ఈ బ్యాటరీ నుంచి మంటలు వచ్చే అవకాశమే లేదని కంపెనీ చెబుతోంది.సో, బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సేఫ్ స్కూటర్ అని చెప్పొచ్చు.

స్కూటర్ నుండి మంటలు రాకుండా ఉండటం కోసం కంపెనీ వారు బ్యాటరీ ప్యాక్ 4 టెంపరేచర్ సెన్సార్లను అమర్చారు.ఇది వెహికల్ టెంపరేచర్ ని గమనిస్తూ, ఎప్పుడైనా టెంపరేచర్ ఎక్కువగా అనిపిస్తే వెంటనే పవర్ కట్ చేస్తుంది.

Telugu Automobile, Bike, Buzzelectric, Cheapelectric, Scooters, Electricscooter,

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కి.మీ వరకు ప్రయాణించగలదు.అలానే గంటకు 55 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లగలదు.బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కేజీల లోడ్ కెపాసిటీతో వస్తుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ వద్ద స్కూటర్ కింది తగులుతుందని భయపడాల్సిన అవసరం లేదు.అలానే ఈ స్కూటర్‌లో బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది.

కావున వెహికల్‌ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఈజీ.బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లతో వస్తుంది.దేశవ్యాప్తంగా ఉన్న స్టెల్లా స్టోర్‌లు డిసెంబర్‌లో స్కూటర్‌లను అందుబాటులోకి తెస్తాయి.ఈ నెలలో షిప్‌మెంట్‌లు కూడా ప్రారంభమవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube