ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు…హడావిడి మామూలుగా లేదు.చాలా వరకు అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలుస్తుంది.

 Another Elections Of Mlc Soon In Ap 2-TeluguStop.com

మరోపక్క మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో  కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది.

ఈ క్రమంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.

 Another Elections Of Mlc Soon In Ap 2-ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రిలీజ్ అయిన షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 25 వ తారీకున నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

నామినేషన్ల దాఖలుకు మార్చి నాలుగో తారీఖు ఆఖరు తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.కాగా మార్చి 15వ తారీకు ఎలక్షన్ నిర్వహించనున్నట్టు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనున్నట్లు తెలిపింది.

ఇక అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేసింది.

.

#Andhra Pradesh #Date #MLC Elections #Notification

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు