రాష్ట్రంలో మోగిన మరో ఎన్నికల నగారా..!!

ఇటీవల ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కానీ 12 పంచాయతీలకు అదేవిధంగా 725 వార్డులకు నామినేషన్ లు పడకపోవడంతో మరోసారి ఆ ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Another Election Bell Ringing In The State-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఈ నెల 15వ తారీఖున పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో వివిధ కారణాల వల్ల నామినేషన్లు వెయ్యని పరిస్థితి ఉండటంతో.వాటి కారణాలను ఆయా జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపటంతో మరోసారి ఈ ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Another Election Bell Ringing In The State-రాష్ట్రంలో మోగిన మరో ఎన్నికల నగారా..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం .సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకూ నామినేషన్ లు స్వీకరించనున్నారు.ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అదే రోజు మూడు మధ్యాహ్నం గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.ఈ నెల 15న పోలింగ్ జరుగుతుంది.

పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నారు.

.

#Srikakulam #Vishakapatanam #StateElection

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు