టీడీపీకి మరో క‌ష్టం.. కీల‌క నేత పార్టీకి గుడ్ బై

ఏపీలో టీడీపీకి ప్ర‌స్తుతం ఉన్న క‌ష్టం ప‌గోడికి కూడా రాకూడ‌దు.రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ త‌గ్గిపోతోంది.

 Another Difficulty For Tdp .. Good Bye To The Key Leader Party, Ap, Ap Political-TeluguStop.com

చంద్ర‌బాబు వ‌య‌స్సు పై బ‌డి పోయింది.ఆయ‌న వ‌యోః భారంతో ఉండ‌డంతో పార్టీని భ‌విష్య‌త్తులోనూ ఆయ‌నే న‌డిపిస్తార‌న్న ఆశ‌లు పార్టీ వీరాభిమానుల‌కే లేవు.

ఇక పార్టీ యువ‌నేత‌గా ఉన్న లోకేష్ సామ‌ర్థ్యంపై పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌కం లేదు.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే చంద్ర‌బాబు లోకేష్‌ను బ‌ల‌వంతంగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు.పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు అల‌వ‌ర్చుకోవ‌డంలో లోకేష్ ఘోరంగా విఫ‌మ‌ల‌య్యారు.

చివ‌ర‌కు ఆయ‌న పోటీ చేసేందుకు ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు వెతికి వెతికి చివ‌ర‌కు రాజ‌ధాని సెంటిమెంట్ ఉంటుంద‌ని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎంచుకుని పోటీ చేశారు.ఆ ఎన్నిక‌ల్లో ఆయన ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కొంద‌రు త‌మ ఎమ్మెల్సీ, ఇత‌ర‌త్రా ప‌ద‌వులు వ‌దులుకున్నా.లోకేష్ మాత్రం త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వినే ప‌ట్టుకుని వేలాడుతున్నారు.

ఇక ఎన్నిక‌ల త‌ర్వాత ఏకంగా ప‌లువురు కీల‌క నేత‌ల‌తో పాటు న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావడంతో పాటు చంద్ర‌బాబునే కాకుండా. లోకేష్‌ను కూడా తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

Telugu Ap Latest, Ap, Christians, Latest, Lokesh, Mangalagiri, Resign, Shock, Td

ఇక ఈ వికెట్ల ప‌రంప‌ర‌లో మ‌రో వికెట్ కూడా ప‌డిపోయింది.క్రిస్టియన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఫిలిప్స్ సీ థోచర్ రాజీనామా చేశారు.గ‌తంలో ఫిలిఫ్స్ థోచ‌ర్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప‌ని చేశారు. ఇటీవల చంద్రబాబు ఫాస్టర్లకు జీతాలు చెల్లించడాన్ని తప్పు పట్టారు.చంద్రబాబు ఈ మధ్య తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిలిప్స్ తెలిపారు.అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వ‌రుస షాకుల్లో బాబుకు ఇది మ‌రో షాకే అనుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube