మరో బాబా రాసలీలలు బట్టబయలు     2017-09-29   02:08:48  IST  Raghu V

డేరా బాబా భాగోతం మరువకముందే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే ఇద్దరు సాధ్వీలని అత్యాచారం చేసిన నేరంలో 20 ఏళ్ళ జైలు శిక్ష పడి జైలు ఊచలు లెక్కపెడుతున్న డేరాబాబా..కోవలోకి మరొక బాబా వచ్చి చేరాడు. తానే దేవుడని ప్రకటించుకొని ఈ బాబా చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తునాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ బాబా ఆశ్రమంలో ఒక దళిత యువతిపై 8 నెలలుగా సాగించిన అత్యాచార ఉదంతం జరిగింది. మిస్ర్తీఖ్ పట్టణంలో తానే దేవుడని ప్రకటించుకొని ఆశ్రమం నిర్వహిస్తున్న బాబా సియారం దాస్ 19 ఏళ్ల దళిత బాలికపై 8నెలలుగా అత్యాచారం చేశాడు.

బాధిత దళిత యువతి పోలీసు కంట్రోలురూంకు ఫోన్ చేసి బాబా అత్యాచార ఉదంతంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి బాధిత యువతిని రక్షించి బాబా సియారం దాస్ ను అరెస్టు చేశారు. బాబా నిర్వహిస్తున్న ఓ లా కళాశాలలో ఉద్యోగం కోసం వచ్చిన దళిత యువతిని రింటూ సింగ్ అనే మేనేజరు బాబా వద్దకు పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇది ఇలా ఉంటే దశరథ్, ఆశిష్ శుక్లాలనే ఇద్దరు వ్యక్తులు యువతిని యాభైవేల రూపాయలకు తమకు విక్రయించారని రింటూ సింగ్ పోలీసులకు చెప్పాడు. యువతి ఫిర్యాదుతో ఆశ్రమంలో బాబా సాగించిన అత్యాచార బాగోతం బట్టబయలైంది. ఈ కేసులో బాబాకు సహకరించిన దశరథ్, శుక్లా, రింటూ సింగ్ ల కోసం గాలిస్తున్నామని సీతాపూర్ ఎస్పీ మృగేంద్రప్రతాప్ సింగ్ చెప్పారు.ఈ బాబా కూడా డేరా సింగ్ లా జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం అని తేలిపోయింది. ఎవరో ఈమెని వీళ్ళకి అమ్మితే వీళ్ళు ఎలా కొనుక్కున్నారు..అంటే ఇలాంటి దండా ఈ ఆశ్రమంలో ఎప్పటినుంచో సాగుతుందనే అనుమానంతో ఆ దిశగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు.