కరోనా నేపథ్యంలో మరో సరికొత్త నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..!!

కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది.రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన ప్రభుత్వం, రానున్న రోజులు వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 10 వరకు రాష్ట్రంలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా రాష్ట్రంలో ర్యాలీలు అదేవిధంగా యాత్రల పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.హోలీ, రంజాన్, ఉగాది, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమి వేడుకలపైనా ఆంక్షలు విధించింది.

ఈ క్రమంలో ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద చర్యలు తప్పవని హెచ్చరించటం జరిగింది.

Telugu Corona, Maharashtra, Telangana-Telugu Political News

అదేవిధంగా ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.  దేశ వ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర.

తెలంగాణ పక్కనే ఉండటంతో.మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల వద్ద వచ్చి పోయే వారిని తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఉంది.

దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు సగానికి పైగా మహారాష్ట్రలో కావడంతో… అక్కడి ప్రభుత్వం వైరస్ విజృంభణ ఉన్న జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేస్తూ రాత్రిపూట రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తూ ఉంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube