ఇంటర్ లో ఏ గ్రూప్ అంటే...'బండ్ల గణేష్' తెలివిగా ఎలా తప్పించుకున్నాడో చూస్తే నవ్వాపుకోలేరు.! బికాం ఫిజిక్స్.?   Another Comedy Interview From MLA Bandla Ganesh     2018-10-30   08:58:19  IST  Sainath G

ఏ ముహుర్తమున “బీకామ్ లో ఫిజిక్స్” అన్నారో కానీ..దెబ్బకి ఫుల్ ఫేమస్ అయిపోయారు టీడీపీ ఎం.ఎల్.ఏ “ఝాలీల్ ఖాన్”. సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నారు. మనం కూడా “ఉంటది ఉంటది. ఎందుకు ఉండదు” అనే డైలాగ్ కూడా వాడేస్తూనే ఉన్నాము..! ఇప్పుడు ఐ డ్రీం నాగరాజు గారి ఇంటర్వ్యూలో మరోసారి బండ్ల గణేష్ గారు దొరికిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

కమెడియన్‌ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్. ఇప్పుడు ప్రొడ్యూసర్‌ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గణేష్.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రెడి అవుతున్నారు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు. గతంలో చాలా వేడుకల్లో కూడా పవన్ భక్తుడిలాగా మాట్లాడి అభిమానాన్ని చాటుకున్నారు. బండ్ల గణేష్ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో బండ్ల గణేష్ చేరొచ్చు కదా.? అని పవన్ ఫాన్స్ కి డౌట్. పైగా జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీనిపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను….ఏ గ్రూప్ అని అడగకండి సర్ అంటూ ఎలా అన్నారో వీడియో చూడండి!