గుండెపోటుతో మరో క‌మెడియ‌న్ మృతి..!  

kannada, comedian, rockline sudhakar, dies, heart attack - Telugu Comedian, Dies, Heart Attack, Kannada, Rockline Sudhakar

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ కమెడియన్ రాక్‌లైన్ సుధాక‌ర్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.

TeluguStop.com - Another Comedian Dies Of Heart Attack

ఆయన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు.ఒక్క నటుడిగా, కమెడియన్ గా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి వారి అభిమానం సొంతం చేసుకున్నారు.

అయితే ఆయన గురువారం ఉదయం షూటింగ్‌ కి వెళ్లారు.షూటింగ్ స్పాట్ లోనే అతనికి గుండెపోటు రావ‌డంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

TeluguStop.com - గుండెపోటుతో మరో క‌మెడియ‌న్ మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో షూటింగ్ సభ్యులు అందరు అతనిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.కానీ ఆయన అక్కడికి వెళ్లే లోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రాక్‌లైన్ సుధాక‌ర్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.ఆయన కరోనాని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు.ఇక య‌థావిధిగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.ఇక ఈ సమయంలో ఆయన అకాల మ‌ర‌ణం చెందడంతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ విషాదంలో మునిగింది.

ఆయన మరణ వార్త విన్న సెలెబ్రెటీలు అంత సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.ఇక సుధాక‌ర్ 992లో ‘బెల్లి మొడ‌గ‌లు’ అనే చిత్రంలో ఓ చిన్న పాత్ర‌తో వెండితెరకు పరిచయం అయ్యారు.

ఇక్క ఆయన ఉపేంద్ర ‘టోపీవాలా’, ‌వ్ ఇన్ మ‌ధ్యల’, య‌శ్ ”, ‘భూత‌య్య‌న మొమ్మ‌గ అయ్యు’,మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి, ‘అయ్యో రామా’, ‘‌, ‘పాంచ‌రంగి’, ‘ప‌ర‌మాత్మ’‌ వంటి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించారు.తనకున్న పట్టుదల, కృషితో అంచెలు అంచెలుగా ఎదిగి స్టార్ హీరోలో సరసన నటించే స్థాయికి చేరుకున్నారు.

ఆయన కన్నడలో 200పైగా సినిమాలు చేశారు.ఇక ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో హాస్యనటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

#Comedian #Heart Attack #Kannada #Dies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Another Comedian Dies Of Heart Attack Related Telugu News,Photos/Pics,Images..