రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదు  

Another Case File Against Tv9 Ravi Prakash-ravi Prakash In Hyderabad Jail,tv9 Ravi Prakash

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ సంస్థ 18 కోట్ల నిధులను గోల్‌మాల్‌ చేశాడంటూ కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే.ప్రస్తుతం జైల్లో ఉన్న రవి ప్రకాష్‌ పై వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఇప్పటికే పలు కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉండగా తాజాగా మరో కేసులో రవి ప్రకాష్‌ ను విచారించేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు.

Another Case File Against Tv9 Ravi Prakash-ravi Prakash In Hyderabad Jail,tv9 Ravi Prakash-Another Case File Against TV9 Ravi Prakash-Ravi Prakash In Hyderabad Jail Tv9

ఒక ఫేక్‌ ఐడీని క్రియేట్‌ చేయడంతో పాటు దాన్ని మిస్‌ యూజ్‌ చేసినందుకు గాను రవి ప్రకాష్‌పై కేసు నమోదు అయ్యింది.

Another Case File Against Tv9 Ravi Prakash-ravi Prakash In Hyderabad Jail,tv9 Ravi Prakash-Another Case File Against TV9 Ravi Prakash-Ravi Prakash In Hyderabad Jail Tv9

ఐ ల్యాబ్‌ పేరుతో నటరాజ్‌ అనే వ్యక్తికి ఒక ఫేక్‌ ఐడీని రవి ప్రకాష్‌ క్రియేట్‌ చేశాడని, ఆ ఐడీతో ఏం చేశాడో మాత్రం తెలియదని అంటున్నారు.

ఫేక్‌ ఐడీ విషయమై సీసీఎస్‌ పోలీసులు 406 యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రవి ప్రకాష్‌ ఆ తర్వాత ఈడీ కస్టడీలోకి కూడా తీసుకునే అవకాశం ఉంది.మొత్తానికి రవి ప్రకాష్‌ను కావాలని వరుస కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే పవర్‌ ఫుల్‌ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్న రవి ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.