టీడీపీలో మ‌రో బిగ్‌వికెట్ డౌన్‌.. కీల‌క మ‌హిళా నేత జంప్ ?

ఏపీలో టీడీపీ నేత‌ల‌పై గురి పెట్టిన వైసీపీ, బీజేపీ వారిని త‌మ పార్టీల్లోకి చేర్చేసుకుంటున్నాయి.ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది రోజులుగా ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మారిపోతున్నారు.

 Another Big Wicket Down In Tdp .. Key Women Leader Jump?, Ap, Ap Political News,-TeluguStop.com

చివ‌ర‌కు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం లేక త‌మ దారి తాము చూసుకుంటున్నారు.ఈ లిస్టులోనే ఇప్పుడు ఓ కీల‌క నేత సైతం పార్టీ మారిపోయేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ కీల‌క నేత ఎవ‌రో కాదు.విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తిన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే ప‌డాల అరుణ‌.

బీజేపీ నేత‌లు సైతం కొద్ది రోజులుగా ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టారు.ఇప్ప‌టికే ఆ పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి పార్టీలోనే ఉన్న మాజీ విప్ గ‌ద్దె బాబూరావును పార్టీలో చేర్చుకున్న క‌మ‌లం నేత‌లు.

ఇప్పుడు అరుణ‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు గజపతినగరంలో మంచి కేడర్ ఉంది.ఆమె 1989, 1994, 2004లలో మూడు సార్లు  ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు.బాబు కేబినెట్లో ఆమె మంత్రిగా కూడా ప‌నిచేశారు.

చివ‌ర‌కు 2004లో వైఎస్ వేవ్‌ను త‌ట్టుకుని మ‌రీ ఎమ్మెల్యేగా గెలిచారు.

Telugu Ap, Aruna, Chandra Babu, Jump, War, Tdp, Ysrcp-Telugu Political News

2014లో బాబు ఆమెను కాద‌ని కె.అప్ప‌ల‌నాయుడుకు సీటు ఇచ్చారు.పార్టీ అధికారంలో ఉన్నా ఆమెకు ప్ర‌యార్టీ లేదు.

ఇక మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆధిప‌త్య రాజ‌కీయాలు కూడా ఆమెను దెబ్బ‌తీశాయంటున్నారు.అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు  కనీసం ప్రాధాన్యత ఇవ్వ‌లేదు.

మూడు ద‌శాబ్దాలుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు బాబు సూచ‌న మేర‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆమె 1999లో ఎంపీగా పోటీ చేసి ప్ర‌స్తుత మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై ఓడిపోయారు.

పార్టీ కోసం ఎన్నో చేసినా చంద్ర‌బాబు ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న‌లో ఉన్న ఆమెపై బీజేపీ నేత‌లు ఫోక‌స్ పెట్ట‌గా.

ఇప్పుడు ఆమె అడుగులు సైతం ఆ దిశ‌గానే ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube