వైసీపీలో పెద్ద ముస‌లం   Another Big Shock To YCP     2016-12-28   03:52:09  IST  Bhanu C

ఏపీలో కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న పార్టీ మారి నాలుగు రోజులైందో లేదో ఆ పార్టీకి ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ త‌గిలింది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌ను ఎలా కాపాడుకోవాలో తెలియ‌క ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ స‌త‌మ‌త‌మ‌వుతుంటే మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు వ‌రుస‌పెట్టి వ‌రుస‌పెట్టి జ‌గ‌న్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వైసీపీ చాలా వీక్‌గా ఉన్న ఉత్త‌రాంధ్రలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముస‌లం మొద‌లైంది. విజయ‌న‌గ‌రం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీరభ‌ద్ర‌స్వామి పార్టీ జిల్లా అధ్యక్ష రాజీనామా చేశారు. ఆ వెనువెంటనే తన అనుచరులతో రహస్యంగా సమావేశం అయ్యారు. జిల్లాలో వైసీపీ బ‌లోపేతంలో ఎంతో కీల‌క‌పాత్ర పొషించిన ఆయ‌న కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ బొత్స స‌త్య‌నారాయ‌ణ జిల్లా వైసీపీలో అంద‌రిని తొక్కేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కోల‌గట్ల కొద్ది రోజులుగా ఫైర్ అవుతున్నారు. ఆయ‌న ఈ విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రై చేసినా ప‌ట్టించుకోలేదు. ఇక ఇటీవ‌ల జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన జ‌గ‌న్ సైతం కోల‌గట్ల‌ను ప‌క్క‌న పెట్టి బొత్స‌తో పాటు బొత్స ఫ్యామిలీకి ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో కోల‌గ‌ట్ల తీవ్ర మ‌న‌స్థాపానికి గురైయ్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

జిల్లా అధ్యక్షుడిగా తాను చేయాల్సిన పనుల్లో కూడా బొత్స మేనల్లుడు అంతా తానై వ్యవహరించడంతో కోలగట్ల మానసిక వేద‌న‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా జ‌గ‌న్ లైట్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి లాభం లేద‌ని డిసైడ్ అయిన ఆయ‌న బుధ‌వారం వైసీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు.

వైసీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసిన కోల‌గ‌ట్ల త‌న అనుచ‌రుల‌తో ర‌హ‌స్యంగా స‌మావేశ‌మైన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీలోకి వెళ్ల‌నున్న‌ట్టు విజ‌య‌న‌గ‌రం ఇన్న‌ర్ పాలిటిక్స్ టాక్‌. అదే జ‌రిగితే వైసీపీలో మ‌రో వికెట్ డౌన్ అయిన‌ట్టే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.