అన్నవరం అంటే వ్రతాలే కాదండోయ్.. ప్రసాదం కూడా!

అన్నవరం పేరు వింటే చాలు.చాలా మందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, విస్తరాకుల్లో అక్కడ దొరికే ప్రసాదమే గుర్తుకొస్తుంది.

 Annavaram Sathyanarayana Wamy Special Story, Annavaram, Pooja , Prasadam , Bangh-TeluguStop.com

కొత్త జంటలతో ఎప్పుడూ ఆ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.స్వామి వారిని దర్శించుకుని పెళ్లైన జంటలు అక్కడ సత్యనారాయణ వ్రతాలు చేస్తే.

ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం.అందుకే కొత్తగా పెళ్లన దంపతులు అక్కడికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు.

 ANNAVARAM SATHYANARAYANA WAMY SPECIAL STORY, Annavaram, Pooja , Prasadam , Bangh-TeluguStop.com

వ్రతాలే కాకుండా అక్కడ దొరికే స్వామి వారి ప్రసాదం కూడా చాలా ఫేమస్.గోధుమ నూక, పంచదార, యాలకుల పొడి, నెయ్యితో చేసే ఆ ప్రసాదాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు.

తిరుపతి లడ్డూ ఎంత ఫేమసో.అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి కూడా అంతే గుర్తింపు ఉంది.

అంతేకాదండోయ్ ఇక్కడు వ్రతాలు ఆచరించే వారి కోసం మరో ప్రసాదాన్ని కూడా తయారు చేస్తారు.అదే బంగీ ప్రసాదం.

Telugu Annavaram, Devotional-Telugu Bhakthi

కానీ ఈ ప్రసాదం కంటే కూడా ఎక్కువ మంది గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతుంటారని అక్కడి ఆలయ అధికారులు చెబుతుంటారు.రత్నగిరి కొండపై ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తప్ప… ఈ ప్రసాదాన్ని ఎక్కడ తయారు చేసిన ఇంత రుచి రాదని అంటున్నారు.స్వామి వారి దయ వల్లే ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుందని భక్తుల నమ్మకం.పిలివగానే పలికి… కష్టాలు కడతీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube