రాజకీయాలకు అనారోగ్యం.. మరి సినిమాలకు ఆ భయం లేదా రజినీ సర్‌?

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దాదాపు ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరించి ఊరించి మొన్నటి వరకు పార్టీ అదుగో ఇదుగో అంటూ ఆశ పెట్టి చివరకు ఉసూరుమనింపించాడు.రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నాను.

 Annathth Movie Shooting Rajinikanth Gets Trolls Annathe , Keerthi Suresh , Nayan-TeluguStop.com

రెండు మూడు రోజుల్లో పార్టీ ప్రకటిస్తాను.మీటింగ్‌ తేదీ అదుగో పార్టీ జెండా ఇదిగో అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి.

రజినీకాంత్ రాజకీయం గురించి పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది.తమిళనాట జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంను నమోదు చేస్తానంటూ రజినీకాంత్‌ చెప్పాడు.

కాని చివరి నిమిషంలో అనారోగ్య కారణాలు చెప్పి రాజకీయాల్లోకి రాలేను క్షమించాలంటూ అభిమానులకు చావు కబురు చల్లగా అన్నట్లుగా చెప్పేశాడు.ఈ విషయమై అభిమానులు తీవ్ర నిరుత్సాహంకు గురి అయ్యారు.

రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వెళ్లక పోవడంకు ఆరోగ్య సమస్యలు అడ్డు వచ్చాయి కాని సినిమాల్లో నటించడంకు మాత్రం ఆయనకు ఆరోగ్య సమస్యలు అడ్డు రాలేదు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది.

ఇలాంటి సమయంలో యువ హీరోల నుండి స్టార్‌ హీరోల వరకు అంతా కూడా షూటింగ్ లను వాయిదా వేసుకున్నారు.కాని రజినీకాంత్ మాత్రం షూటింగ్‌ లకు బ్రేక్ ఇవ్వడం లేదు.

అన్నాత్తే సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ ను కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆపేశారు.

ఆ సమయంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి.అయినా కూడా షూటింగ్‌ ను నిలిపేశారు.

కాని ఇప్పుడు మాత్రం కరోనా కేసులు అత్యధికంగా ఉన్నా కూడా భయం లేకుండా షూటింగ్‌ ను చేస్తున్నారు.రాజకీయాల్లో జాయిన్ అయ్యేందుకు కరోనా భయం అడ్డు వచ్చింది కాని షూటింగ్‌ లో మాత్రం ఎందుకు రజినీకాంత్ కు కరోనా భయం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు

.

రాజకీయాల్లో రాణించలేను

అనే ఉద్దేశ్యంతో ముందస్తుగానే రజినీకాంత్ చేతులు ఎత్తేసినట్లుగా కొందరు విసుర్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube