లోకేష్ ఇక జైలుకేనా అసలేం జరుగుతోంది..  

Annam Sathish Comments On Nara Lokesh-

జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సమీక్షలు నిర్వహిస్తూనే, గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ, మాజీ సీఎం తో సహా అందరికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.పోలవరం అవినీతి మొత్తం కక్కిస్తానని, పవర్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని చంద్రబాబు నాయుడికి ముర్చెమటలు పట్టిస్తున్నారు.అంతేకాదు బాబు చేసిన అక్రమాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారు కూడా...

Annam Sathish Comments On Nara Lokesh--Annam Sathish Comments On Nara Lokesh-

నిభందనలు ఉల్లంఘించి ఓ సీఎం స్థాయి వ్యక్తి అక్రమం కట్టడంలో ఉంటున్నారు అనే విషయాన్ని హైలెట్ చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు.ఈ కారణాలతో 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు కి కంటిమీద కునుకు పట్టడం లేదట.ఇదిలాఉంటే తాజాగా జగన్ లోకేష్ అక్రమాలపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.అసలు చంద్రబాబు కంటే కూడా లోకేష్ ని టార్గెట్ గా చేసి ఊచలు లేక్కిస్తేనే బెటర్ అన్న నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చారట.ఈ క్రమంలోనే

మాజీ ఐటీ మంత్రి అయిన లోకేష్ తన హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ముందు నుంచీ వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయంపై వైసీపీ నేతలు మాట్లాడక పోయినా గతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఏకంగా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడంతో టీడీపీ ఒక్క సారిగా ఉలిక్కి పడింది.లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడ్డారని సతీష్ చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది..

Annam Sathish Comments On Nara Lokesh--Annam Sathish Comments On Nara Lokesh-

లోకేష్ చేసిన అవినీతిపై విచారణ చేపట్టాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ని త్వరలో కలుస్తానని.జగన్ తో మాట్లాడిన తరువాత కేంద్రానికి కూడా లోకేష్ అవినీతిపై నివేదిక ఇచ్చి సీబీఐ విచారణ చేపట్టామని ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.చూస్తుంటే చంద్రబాబు కంటే కూడా చినబాబు చుట్టూ ముందుగా ఉచ్చు బిగుస్తుందేమో అంటున్నారు పరిశీలకులు.