వరుసకు అన్నా చెల్లెలు అవుతారని తెలియక..శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారు.! చివరికి ఏమైందో తెలుసా.?     2018-07-02   03:58:26  IST  Raghu V

ఈ కాలం పిల్లలకు మన సొంత కుటుంబంలోని సభ్యులు కూడా తెలిసిన దాఖలాలు చాలా తక్కువ.. కనీసం పెళ్లిల్లు, ఏదన్నా ఫంక్షన్స్లోనన్నా అప్పుడప్పుడు కలిస్తే ఎవరు ఏంటి.. వాళ్లు మనకేం అవుతారు అనే ఆలోచన ఉంటుంది.. చదువులు, ఉరుకులు పరుగులు జీవితంలో తమ గురించి తాము పట్టించుకోవడమే తక్కువ అనుకుంటే ఇంక మన బందువులు ఎవరు వాళ్లు మనకేం అవుతారు అిన ఆలోచించే తీరికెవరికుంటుంది అంటారా..? బ్రహ్మోత్సవం సినిమాలో మహేశ్ బాబు తన కుటుంబంలోని అన్ని తరాల వారిని కలవాలనుకుంటూ వెళ్లి..అందరిని ఒకే చోట కలిసేలా చేస్తాడు. కానీ మనం దానికి బిన్నంగా బతుకుతున్నాము. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు అనుకుంటున్నారా.? అలా బంధుత్వాలు తెలియక ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా చూస్తే ఆ ప్రేమికులు ఇద్ద‌రూ దూర‌పు బంధువులు. వ‌ర‌స చూసుకుంటే చెల్లెలు అవుతుంది. అవేవీ తెలియ‌ని వారిద్ద‌రూ ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు.

కర్నాటక లోని బాగ‌ల్‌కోటె న్యూసిటీ సెక్టార్ 12కు చెందిన సాగ‌ర్ సుగ‌త్‌క‌ర్‌ తన ప్రేమను గెలిపించాలని,తన ప్రియురాలిని తనతో కలపాలని పోలిస్ స్టేషన్ ముందు దర్నా చేస్తున్నాడు.సాగర్ అదే కాల‌నీకి చెందిన యువ‌తిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు.రెండు కుటుంబాలు మీ ప్రేమను అంగీకరించం అని ఖరాఖండీగా చెప్పేసి ప్రేమికురాలిని నిర్భందించారు..

చెల్లెలి వ‌రస అవుతుంద‌నే విష‌యం తెలియ‌క ఆమెతో శారీర‌క సంబంధం కూడా పెట్టుకున్నాడు సాగర్. వారి ప్రేమ వ్య‌వ‌హారం తెలిశాక రెండు కుటుంబాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి.చెల్లెలి వ‌ర‌స‌య్యే యువ‌తితో ప్రేమ, పెళ్లి కుదర‌దంటూ కేక‌లు వేశారు. యువ‌తి ఇంట్లోంచి కాలు బ‌య‌టికి పెట్ట‌కుండా క‌ట్టుదిట్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ ప్రేమికుడు ఊరుకోలేదు..తన యువతిని తనతో కలిపే బాద్యత పోలిసులదే అంటున్నాడు..చూడాలి ఏమవుతుందొ..