యూఎస్: ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్‌కు కొత్త ఛైర్మన్‌.. ‘ కాకా ’ వారసుడు ఎవరంటే..?

అమెరికాలోని భారతీయ సంఘాల్లో ప్రముఖమైన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) కొత్త ఛైర్మన్‌గా అంకుర్ వైద్య నియమితులయ్యారు.ఇప్పటి వరకు ఛైర్మన్ పదవిలో ఉన్న రమేశ్ పటేల్ కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.

 Ankur Vaidya Appointed New Chairman Of Federation Of Indian Associations,ankur V-TeluguStop.com

కాగా 40 ఏళ్ల అంకుర్ వైద్య ఎఫ్ఐఏతో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలను కలిగి వున్నారు.ఎఫ్ఐఏ బోర్డులో అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన వైద్య… ఇప్పుడు ఛైర్మన్‌గా ఎంపికవ్వడం విశేషం.

పటేల్ కన్నుమూసిన తర్వాత ఎఫ్ఐఏ అధ్యక్షుడు అనిల్ బన్సాల్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో సభ్యులు కొత్త బాడీని ఎన్నుకున్నారు.దీని ప్రకారం ఇండియన్ అమెరికన్ వైద్యుడు సుధీర్ పరిఖ్.

పారిశ్రామిక వేత్త హెచ్ఆర్ షాలు అంకుర్ వైద్యకు సీనియర్ సలహాదారులుగా వ్యవహరిస్తారని ఎఫ్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే బిపిన్ పటేల్‌ను ఎఫ్ఐఏ ఛైర్మన్‌గా, జయేశ్ పటేల్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ప్రస్తుత బోర్డులో రాంభాయ్ గాధావి, చంద్రకాంత్ త్రివేది, ప్రబీర్ రాయ్, డాక్టర్ ‌పర్వీన్, ఆండీ భాటియా, శ్రుజల్ పరిఖ్, ఆనంద్ పటేల్, దీపక్ పటేల్, కనుభాయ్ చౌహాన్ వున్నారు.

ఇండియన్ అమెరికన్ సమాజం ‘‘ కాకా’’గా పిలుచుకునే రమేశ్ పటేల్ 1988 నుంచి 1990 వరకు ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో వివిధ పదవులను నిర్వహించారు.

తన ముందుచూపు, కార్యదక్షతతో 50 ఏళ్లుగా ఎఫ్ఐఏను నడిపిస్తున్నారు.భారత్- అమెరికాలో మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి రమేశ్ కృషి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube