రియా వాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన అంకిత... అబద్ధాలు ఆడి దొరికేస్తుంది

సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉంది.ఈ కేసు విచారణలో రియా చుట్టూ ఉచ్చు బిగుసుకునే విధంగా ఒక్కొక్కటిగా నిజాలు బయటకి వస్తున్నాయి.

 Ankita Lokhande Posts Video Of Sushant Singh Rajput Flying, Reha Chakraborty, Su-TeluguStop.com

సుశాంత్ కి రియానే డ్రగ్స్ అలవాటు చేసిందని, అతని ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది.మరో వైపు తనపై వస్తున్న ఆరోపణలని తప్పించుకొని అందరి ఆలోచనలని డైవర్ట్ చేయడానికి రియా మీడియా ద్వారా ఏవో విషయాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంది అని అందరి వాదన.

ఆమెని కావాలని టార్గెట్ చేస్తున్నారనే విధంగా ఆమె ఇంటర్వ్యూ సాగింది.దీనిలో మొత్తం అంతా సుశాంత్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేసింది.

సుశాంత్ కి మానసిక వ్యాధి ఉందని నమ్మించే ప్రయత్నం చేసింది.ఇందులో భాగంగా తామిద్దరం యూర‌ప్ ట్రిప్ లో ఉన్న‌ప్పుడు క్లాస్ట్రోఫోబియా బాధ‌ప‌డుతున్నట్లు సుశాంత్ త‌న‌తో చెప్పిన‌ట్లు రియా తెలిపింది.

ఫ్లైట్ జ‌ర్నీలో క్లాస్ట్రోఫోబియా ఉంద‌ని, సుశాంత్ కి విమాన ప్రయాణాలు అంటే విపరీతమైన భయం అని పేర్కొంది.

అయితే ఆమె చెప్పే మాట అబద్ధం అని సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే వెంటనే ప్రూవ్ చేసింది.

రియా చెబుతున్నట్లు సుశాంత్‌కు అలాంటి వ్యాధులేవీ లేవని, అవన్నీ అసత్యాలని అన్నారు.విమాన ప్రయాణంలో భయాలు లేవని చెప్పే ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది.2018లో సుశాంత్ బోయింగ్ 737 బేస్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకున్నారు.ట్రైనింగ్ అనంత‌రం నా 150క‌ల‌ల్లో ఒక క‌ల నెర‌వేరింది.ల‌వింగ్ మై డ్రీమ్ అంటూ ఫ్లైట్ ట్రైనింగ్ వీడియోను ట్వీట్ చేశారు.2019 మార్చిలో సుశాంత్ ఓ విమానాన్ని ఎలా డ్రైవ్ చేయాలో ట్రైనింగ్ తీసుకున్న వీడియోను ట్వీట్ చేశాడు.ట్రైనింగ్ స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన వీడియోను ట్వీట్ చేస్తూ మీరు ఆనందంగా ఉండండి.మీ మ‌న‌సు మాట వినండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.ఆ వీడియోనే అంకిత లోఖండే సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.ఇదేనా నువ్వు చెప్పే క్లాస్ట్రోఫోబియా అంటే అని ప్రశ్నించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube