సుశాంత్ మాజీ ప్రేయసి పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు!

Ankita Lokhande And Boyfriend Vicky Jain Got Married

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం రేపింది.ఈయన మరణం తర్వాత ఆయన ప్రేయసి అయినా అంకిత ను సుశాంత్ సింగ్ అభిమానులు తీవ్రంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

 Ankita Lokhande And Boyfriend Vicky Jain Got Married-TeluguStop.com

సుశాంత్ మరణం సమయం కంటే ముందే వీరిద్దరికి బ్రేక్ అప్ అయ్యింది.సుదీర్ఘ కాలం ప్రేమ తర్వాత వీరిద్దరూ కెరీర్ మీద ద్రుష్టి పెట్టేందుకు బ్రేక్ అప్ చేసుకున్నారని తెలిపారు.

ఇక ఆ తర్వాత సుశాంత్ హీరోగా కూడా చేసి సక్సెస్ అందుకున్నాడు.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించాడు అనే వార్త బాలీవుడ్ ను షేక్ చేసింది.

 Ankita Lokhande And Boyfriend Vicky Jain Got Married-సుశాంత్ మాజీ ప్రేయసి పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుశాంత్ సింగ్ మరణం విషయంలో ఆయన మాజీ ప్రేయసి అంకిత కు సంబంధం లేకపోయినా ఆమె మీద సుశాంత్ అభిమానులు తప్పుబడుతూ ట్రోల్ చేసారు.ఆమెతో బ్రేక్ అప్ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు.

కానీ వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగారు.ఇక తాజాగా అంకిత పెళ్లి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సుశాంత్ తో బ్రేక్ అప్ తర్వాత ఆమె విక్కీ జైన్ తో ప్రేమలో పడింది.వీరిద్దరి పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా రావడంతో ఆగిపోయింది.ఇక ఆ తర్వాత సుశాంత్ మృతి కూడా వారికీ ఇబ్బందిని కలిగించింది.

ఇక ఎట్టా కేలకు ఇన్ని రోజుల తర్వాత ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండడంతో ఇండస్ట్రీ ప్రముఖులు వీరికి కంగ్రాట్స్ చెప్పారు.

వీరిద్దరి జంట బాగుందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఈ పెళ్లి ఫొటోలపై ఒక లుక్కేయండి.

#Ankita Lokhande #AnkitaLokhande #Vicky Jain #SushantSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube