అంజనా దేవి అహల్య కూతురా? అయినా కన్నబిడ్డనే ఎందుకు శపించింది?

ఆంజనేయ స్వామి తల్లి అయిన అంజనా దేవి… జన్మ వృత్తాంతం గురించి విచిత్ర రామాయణంలో వివరించిబడింది.అహల్య, గౌతమ ముని కూతురే అంజనా దేవి.

 Anjana Devi Is Daughter Of Ahalya And Gouthama Muni,anjana Devi, Ahalya , Gouthama Muni , Daughter , Surya Bhagavan, Devotional-TeluguStop.com

అయితే ఎంతో అందగత్తె అయిన అహల్య దేవి వద్దకు సూర్యుడు.గౌతముడు లేని సమయంలో వచ్చాడు.

ఆయన తేజస్సుకు అహల్య చూపు కోల్పోయింది.అలా అహల్యకు సూర్యుడి వల్ల ఓ కుమారుడు జన్మించాడు.

 Anjana Devi Is Daughter Of Ahalya And Gouthama Muni,Anjana Devi, Ahalya , Gouthama Muni , Daughter , Surya Bhagavan, Devotional-అంజనా దేవి అహల్య కూతురా అయినా కన్నబిడ్డనే ఎందుకు శపించింది-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత కొన్నాళ్లకు మరొక కుమారుడు జన్మించాడు.ఈ విషయం తెలియని గౌతముడు కుమారులను భుజాలపై ఎత్తుకొని.

కూతురైన అంజనా దేవిని నడిపించుకుంటూ సముద్ర తీరం వద్ద తిరుగుతున్నాడు.

అంజనా దేవికి కాళ్లు నొప్పులు పుట్టడంతో… నీ కన్న కూతురిని నడిపించి తీసుకెళ్తూ… పరుల బిడ్డలను భుజాలపై ఎత్తుకుంటావా? అని ప్రశ్నించిందట.దీంతో కోపోద్రిక్తుడైన గౌతమ ముని.మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరు ముఖాలు గాక అని శపించి వారిని సముద్రంలోకి తోసేశాడట.ఆ పిల్లలే వాళి, సుగ్రీవులుగా మారారని పురాణాలు చెబుతున్నాయి.ఈ విషయం తెలుసుకున్న అహల్య… కన్న కూతురే తన గుట్టు బయట పెట్టినందుకు అంజనా దేవిని శపించిందట.

నీకు వానరుడే కుమారుడుగా పుట్టాలని అందంట.అలా అంజనా దేవికి, కేసరికి వాయు దేవుడి అంశతో పుట్టిన వాడే ఆంజనేయ స్వామి.కానీ మామూలు రామాయణ కథలో మాత్రం అంజనా దేవి వానరుడైన కుంజరుడి కూతురని ఉంది.ఏది ఏమైనప్పటికీ.భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ.ఎంతో ధైర్యాన్ని అందించే అంజన్నను మాత్రం అందించిన మహా సాధ్వి అంజనా దేవి.

Anjana Devi Is Daughter Of Ahalya And Gouthama Muni,Anjana Devi, Ahalya , Gouthama Muni , Daughter , Surya Bhagavan, Devotional - Telugu Anjana Devi, Anjaneya Swamy, Anjanna, Devotional

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube