అతని దర్శకత్వంలో నటించాలనుంది: అంజలి  

Heroine Anjali wants to act in Mani Ratnam Direction, Mani Ratnam , Actress Anjali, Nishabdam, Anjali Offers, Nandi Awards - Telugu Actress Anjali, Anjali Offers, Heroine Anjali Wants To Act In Mani Ratnam Direction, Mani Ratnam, Nandi Awards, Nishabdam

వివాదాలు, ఎఫైర్ల‌తో కెరియ‌ర్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న అంజ‌లి కాలేజీ ద‌శ‌లో ఉండ‌గా సినీ అవ‌కాశాల కోసం షార్ట్ ఫిల్మిం ల‌లో యాక్ట్ చేసింది.ఆమె యాక్టింగే ఆమెను వెండితెర ‌పైకి నడిపించింది.

TeluguStop.com - Anjali Want To Act On Direction Of Mani Ratnam

జీవా హీరోగా త‌మిళంలో ఎంట్రీ ఇచ్చింది.అదే సినిమా తెలుగులో డేర్ గా వ‌చ్చినా సరైన బ్రేక్ రాలేదు.

కానీ 2006లో వ‌చ్చిన ఫోటో, 2007లో ప్రేమ‌లేఖ రాశా, షాపింగ్ మాల్ సినిమాల‌తో స్టార్ డ‌మ్ సంపాదించింది.షాపింగ్ మాల్ ఆమె న‌ట‌న‌కు ముగ్ధుడైన త‌మిళ డైర‌క్ట‌ర్ ముర‌గ‌దాస్ జ‌ర్నీలో అవ‌కాశం ఇచ్చారు.

TeluguStop.com - అతని దర్శకత్వంలో నటించాలనుంది: అంజలి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ అవ‌కాశ‌మే అంజలీ కెరియ‌ర్ ను మార్చేసింది.చ‌క్క‌టి ఆహ‌భావాలు, డామినేటింగ్ క్యారక్ట‌ర్ తో క‌ట్టిప‌డేసింది.

దీంతో తెలుగులో ఆఫ‌ర్స్ క్యూక‌ట్టాయి.సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, బ‌లుపుతో పాటు త‌మిళం లో వ‌రుస సినిమాల‌తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.నంది అవార్డ్ తో పాటు 2010 త‌మిళ్ లో అంగాడి తెరు అనే సినిమాలో క‌నిగా క‌న్పించి ఫిల్మిం ఫేర్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.
స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే కెరియ‌ర్ లో ఎత్తుప‌ల్లాల్ని చ‌విచూసింది.2013లో త‌న పిన్ని భార‌తి ‌, డైర‌క్టర్ క‌లాంజియం లు త‌న‌ని వేధిస్తున్నారని ప‌బ్లిక్ గా చెప్ప‌డంతో ఆ ఇష్యూ ర‌చ్చ ర‌చ్చైంది.అయినా స‌రే సినిమాపై ఉన్న మక్కువ‌ తో ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే గీతాంజ‌లి, చిత్రాంగ‌ద‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన నిశబ్ధం సినిమా న‌టించి మెప్పించిన ఈ తెలుగు ముద్దుగుమ్మకు ఎప్ప‌టికైనా మ‌ణిర‌త్నం సినిమాలో యాక్ట్ చేయాల‌ని కోరిక‌గా ఉన్న‌ట్లు తెలిపింది.

స్టార్ హీరోలు, దిగ్గ‌జ ద‌ర్శ‌కుల డైర‌క్ష‌న్ లో హిట్లు కొట్టినా స‌రే మ‌ణిర‌త్నంతో ప‌నిచేయాల‌ని క‌ల క‌ల‌గానే మిగిలిన‌ట్లు తెలిపింది అంజ‌లి.

#Actress Anjali #Anjali Offers #Nishabdam #Nandi Awards #HeroineAnjali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anjali Want To Act On Direction Of Mani Ratnam Related Telugu News,Photos/Pics,Images..