అంజలి టాలీవుడ్‌ ఆశలన్నీ ఆ సినిమాపైనే ఆధారపడి ఉన్నాయి  

Anjali Tollywood Nishabdam Anushka - Telugu Anjali, Anushka, Corona, Nishabdam, Tollywood

తెలుగమ్మాయి అయినా కూడా కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఎక్కువగా అవకాశాలు దక్కాయి.తెలుగులో ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా అవి ఆడలేదు.

 Anjali Tollywood Nishabdam Anushka

దాంతో కోలీవుడ్‌కే పరిమితం అయ్యింది.అయితే తెలుగులో ఈ అమ్మడు రాణించాలనే పట్టుదలతో ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు నిశబ్దం చిత్రం కోసం వెయిట్‌ చేస్తోంది.అనుష్క హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాలో అంజలి కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

అంజలి టాలీవుడ్‌ ఆశలన్నీ ఆ సినిమాపైనే ఆధారపడి ఉన్నాయి-Latest News-Telugu Tollywood Photo Image

అంజలి హీరోయిన్‌గా ఈమద్య కాలంలో కోలీవుడ్‌లో కూడా పెద్దగా రాణించడం లేదు.దాంతో ఈమెకు టాలీవుడ్‌లో బిజీ అవ్వాలనే కోరిక కలిగింది.అక్కడ స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు రాకపోవడంతో టాలీవుడ్‌లో కనీసం లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో అయినా బిజీ అవ్వాలని ఈ అమ్మడు ఆశపడుతోంది.అందుకే నిశబ్దం చిత్రంతో మళ్లీ పుంజుకుని తెలుగులో బిజీ అవ్వాలనేది ఈ అమ్మడి ఆశగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అంజలి తెలుగులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.దాంతో ఆమెను కమర్షియల్‌ హీరోయిన్‌గా చూసేందుకు ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు.ఆ కారణంగానే ఆమెను వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల కోసమే సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆమె లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు కూడా చేసేందుకు ఒప్పుకుంటున్నా ఈమద్య అవి కూడా రావడం లేదట.

అందుకే ఇప్పుడు నిశబ్దం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఈమె ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు