ఎఫ్3లో ఆ పాత్ర కోసం అంజలిని ఫైనల్ చేసిన రాజుగారు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ గా ఎఫ్3 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.

 Anjali Ropes In Anil Ravipudi F3, Tollywood, Venkatesh, Varun Tej, Tamannaah, Di-TeluguStop.com

అయితే వరుణ్ తేజ్ గని, వెంకటేష్ దృశ్యం షూటింగ్ లలో బిజీగా ఉండటంతో ఎఫ్3 సెకండ్ షెడ్యూల్ ఇంకా స్టార్ట్ చేయలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి భాగంలో ఉన్న ఆర్టిస్ట్ లు అందరిని కొనసాగించడంతో పాటు మరో హీరోయిన్ ని కూడా ఖరారు చేశారు.

తమన్నా, మెహరీన్ మెయిన్ లీడ్స్ లో కొనసాగుతున్నారు.ఇక మూడో హీరోయిన్ గా సోనాల్ చాహన్ ని ఇది వరకు ఫైనల్ చేశారు.

అయితే ఆమె ప్రస్తుతం ముంబైలో ఉండటంతో, అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ రాలేని పరిస్థితి నెలకొంది.ఈ నేపధ్యంలో సోనాల్ చాహన్ చేయాలని పాత్ర కోసం ఇప్పుడు అంజలిని దిల్ రాజు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

చాలాగ్యాప్ తర్వాత తాజాగా వకీల్ సాబ్ సినిమాతో అంజలి తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఇందులో నటించిన నివేథా థామస్, అంజలి, అనన్యకి మంచి పేరు వచ్చింది.

వారి పెర్ఫార్మెన్స్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా కితాబు ఇచ్చేశాడు.దీంతో ఇప్పుడు మళ్ళీ అంజలికి తెలుగులో అవకాశాలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇక దిల్ రాజు కూడా వకీల్ సాబ్ ఇంపాక్ట్ తో సోనాల్ చేయాల్సిన పాత్ర కోసం అంజలిని కన్ఫర్మ్ చేసేశారు.అనిల్ రావిపూడి కూడా అంజలికి ఒకే చెప్పినట్లు బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube