అఫైరే లేదు... ఇక బ్రేకప్ ఎక్కడ నుంచి అంటున్న అంజలి  

Anjali Denies Being In Any Relationship Before-jai,lisa,vizag Girl,అంజలి,జై

తెలుగు లో పక్కింటి అమ్మాయిలా కనిపించే వైజాగ్ అమ్మాయి అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లో అంజలి నటనను చూస్తే ఎవరైనా పక్కింటి అమ్మాయి లా ఉంది అని అనక మానరు. అలాంటి అంజలి కి తెలుగు లో పెద్ద అవకాశాలు రాలేదు కానీ తమిళ ఇండస్ట్రీ లో మాత్రం బాగానే నిలదొక్కుకుంది..

అఫైరే లేదు... ఇక బ్రేకప్ ఎక్కడ నుంచి అంటున్న అంజలి -Anjali Denies Being In Any Relationship Before

అయితే అంజలి సినిమా ల కంటే కూడా ఆమె బాయ్ ఫ్రెండ్ నటుడు జై తో ఉన్న అఫైర్ గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు అసలు అలాంటిది ఏమి లేదని ఇప్పుడు తాజాగా మీడియా కు తెలిపింది. అంజలి కొత్త చిత్రం ‘లిసా’ ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ, “ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం నాకు వుంది.

హారర్ థ్రిల్లర్ సినిమాలను నేను ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాను.

అందువల్లనే ఆ తరహా సినిమాల్లో నా నటన మరింత బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నాకు ఎవరితోనూ అఫైరే లేదు కావున బ్రేకప అయ్యే అవకాశమే లేదంటూ అంజలి చెప్పింది. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు.

అంతేకాకుండా నా పెళ్లి గురించి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నాకు అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచనే లేదు ప్రస్తుతం నా కెరీర్ పైనే నా దృష్టి ఉంది. నా తదుపరి చిత్రం కోసం నేను అమెరికా వెళుతున్నాను అని అంజలి చెప్పింది.

అంజలి,జై ల మధ్య చాలా కాలం పాటు అఫైర్ సాగిన సంగతి తెలిసిందే. ఒకరి షూటింగ్ లకు మరొకరు వెళ్లడం,ఒకరి పుట్టిన రోజులను మరొకరు సెలబ్రేట్ చెయ్యడం వంటి వి చాలానే జరిగాయి. వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో కూడా ఒకప్పుడు హల్ చల్ చేశాయి.

అయితే ఇప్పుడు మాత్రం అసలు అఫైరే లేదంటూ అంజలి స్పష్టత నిచ్చింది.