పవన్ సినిమా గాలి తీసిన బ్యూటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు.ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.

 Anjali Condemns Rumours About Pawan Kalyan Movie-TeluguStop.com

కాగా బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు పవన్.ఈ సినిమాలో పవన్ గెటప్‌ మామూలుగానే ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఇప్పటికే నివేదా థామస్ మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా మరో హీరోయిన్‌గా అంజలి ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదంటూ అంజలి పాప కొట్టిపారేసింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని తనను ఎవరూ సంప్రదించలేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయని ఆమె మండిపడింది.దీంతో ఈ సినిమాలో అంజలి నటిస్తోందనే వార్త గాలివార్తగానే మిగిలిపోయింది.

ఇక ఈ సినిమా షూటింగ్‌లో పవన్ నిరవధికంగా పాల్గొని సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.మరి ఈ సినిమాలో అంజలి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube