సాధరణంగా ఏ అభిమాని అయిన గాని ఎక్కువగా సినిమాల్లో నటించే హీరోని మాత్రమే ఇష్టపడతారు.విలన్ ను ఇష్టపడరు.
ఎందుకంటే సినిమాలో ప్రతి నాయకుడు అన్యాయాన్ని చేస్తాడు కాబట్టి అతన్ని అందరు తిట్టుకుంటూ ఉంటారు.అయితే ఒక సినిమా హిట్ అయిందంటే ఆ క్రెడిట్ లో సగభాగం విలన్ కి కూడా దక్కుతుంది.
అలా విలన్ గా నటించి అందరి మెప్పుని సంపాదించుకున్న విలన్స్ లో తరుణ్ రాజ్ అరోరా కూడా ఒకరు.మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన స్టైలిష్ విలన్ తరుణ్ రాజ్ అరోరా.
తన విలనిజంలో కూడా ఒక ప్రత్యేకత ప్రదర్శిస్తూ ఉంటారు .అందుకే ఆయన్ని స్టైలిష్ విలన్ అని అంటూ ఉంటారు.మెగాస్టార్ సినిమా తరువాత అర్జున్ సురవరం అనే సినిమాలో కూడా ప్రతి నాయకుడిగా నటించాడు.ఆయన విలన్ గా నటించిన అర్జున్ సురవరం మంచి హిట్ అవ్వడంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
అలాగే ఆయన ఒక ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కుడా మనకి తెలియచేసారు.
ఇంతకీ తరుణ్ రాజ్ అరోరా గురించి మీ అందరికి తెలియని విషయం ఏంటంటే.ఆయన మరెవరో కాదు.ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన అంజలి జవేరి భర్త.
తరుణ్ రాజ్ కెరీర్ మొదటగా మోడలింగ్ రంగంతో స్టార్ట్ అయిందంట.అందుకనే ఆయన నటించే ప్రతి సినిమాలో కూడా స్టైలీష్ గా కనిపించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారట.
తరుణ్ రాజ్ పుట్టింది అస్సాం రాష్ట్రంలో.ఆయన చదువుల నిమిత్తం అని చెన్నై కి వచ్చాడట.
అలాగే బెంగుళూరు సిటీలో మోడలింగ్ చేశారు.అలా సౌత్ ఇండియాకి సంబంధించిన అన్నీ సిటీస్ తో ఆయనకు అనుబంధం పెరిగింది.
హిందీ చిత్రాల్లో అవకాశాలు రావడంతో ముంబై వెళ్లారు.తరువాత అక్కడ్నుంచి ఇప్పుడు మళ్లీ దక్షిణాదికి వచ్చారు.
ఇప్పుడు చాలామంది ఆయనని సౌత్ విలన్ అని పిలుస్తుంటారు.అలాగే ఈ గుర్తింపుని ఆయన ఆస్వాదిస్తున్నారని తెలిపారు.
ఆయన భార్య అంజలా జవేరి తన నటన గురించి ఎప్పుడూ కూడా ఎటువంటి సలహాలు ఇచ్చేది కాదట.నీకు నచ్చినట్లు నువ్వు చెయ్ అని ప్రోత్సాహం ఇచ్చేదట.
తాను నటించిన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుందట.అయితే తాను నటించిన కొన్ని పాత్రలు సంతృప్తిని ఇవ్వకపోవడంతో ఒకానొక సమయంలో మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారట.
అసలు అంజలి జవేరితో తన పెళ్లి ఎలా జరిగిందో కూడా వివరించారు.
అంజలా జవేరి, తరుణ్ రాజ్ ఇద్దరు కూడా ముంబైలో ప్రేమలో పడ్డారట.అంతేకాదు వాళ్ళది ఇరవయ్యేళ్ల ప్రేమబంధం అంట.తరుణ్ మోడలింగ్ చేసే సమయంలో అంజలా జవేరి సినిమాలో హీరోయిన్ గా కొనసాగుతుంది.తాను దక్షిణాదిలో బాగా పాపులర్ హీరోయిన్.ఒక ఈవెంట్ లో కలుసుకున్నప్పుడు ఇద్దరికీ పరిచయం అనేది ఏర్పడింది.ఆ తరువాత కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్నారు.కొన్నాళ్ల తరువాత ముందుగా తరుణ్ రాజ్ నే అంజలి జీవేరికి తన ప్రేమను వ్యక్తం చేసారట.
అంజలి జవేరి కూడా ఓకే చెప్పడంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు.
కానీ ఈ దంపతులకు పిల్లలు లేరు.
వాళ్లే పిల్లలు వద్దు అని అనుకున్నారట.వాళ్లిద్దరూ ఒకరికొకరు కలిసి పిల్లలులాగా ఉంటారట.
అయితే భవిష్యత్ లో కూడా ఇకమీదట పిల్లల్ని కనే ఉద్దేశం లేదని తరుణ్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.పిల్లలు వద్దు అనుకోవడం వెనుక గల కారణాన్ని కూడా ఆయన ఇలా తెలిపారు.
పెద్దలు కుదిర్చిన బంధంలో పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య మరింత ప్రేమ పుట్టేందుకు పిల్లలొస్తుంటారు.కానీ మేం మాత్రం ముందు నుంచే ప్రేమలో ఉన్నాం.
అందుకే మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నాము.నాకు సంబంధించినంత వరకు అంజలి నాకు ఒక పాపాయి లాంటిది అని తెలిపారు.
నిజంగా వీళ్ళ మధ్య అండర్ స్టాండింగ్ భలే ఉంది కదా.అయితే అంజలి మళ్ళీ సినిమాల్లో నటించాలి అనుకుంటే తనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని, తనకి నచ్చిన పాత్రలు వస్తే మళ్ళీ సినిమాల్లో నటిస్తుందని తెలియచేసారు.