కోవిడ్‌కు ముక్కుతాడు.. కెనడాలో మారుమోగుతున్న భారతీయ మహిళ పేరు

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భూగోళాన్ని కనుసైగతో శాసించే దేశాలను సైతం కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెట్టింది.

 Anita Anand A Canadian Minister Leading From The Front Amid Covid 19 Pandemic, A-TeluguStop.com

ఈ మహమ్మారి దెబ్బకు ఆత్మీయులను దూరం చేసుకున్న వారు, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డవారు, వైరస్ నుంచి కోలుకుని దాని తాలూకూ దుష్ప్రభావాలను అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు.ఏడాదిన్నర కావొస్తున్నా ప్రపంచంపై కోవిడ్ ముప్పు తొలగిపోలేదు.

ఉత్పరివర్తనం చెందిన వైరస్ కొత్తగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.ఇక గతేడాది కరోనాను కంట్రోల్ చేసేందుకు ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి.

ఈ సందర్భంగా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.ఇప్పుడు కెనడాలో భారత సంతతికి చెందిన ఓ మహిళా మంత్రి పేరు మారుమోగుతోంది.

దేశంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో అనితా ఆనంద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.కెనడా పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ రిసీవర్ జెనరల్ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అనితా ఆనంద్.

కరోనా మొదలైనప్పటి నుంచి అన్నితానై వ్యవహరిస్తున్నారు.కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు టెస్టులు నిర్వహించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడం వంటి చర్యల ద్వారా వైరస్ దూకుడుకు అడ్డుకట్ట వేశారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కెనడా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని అనితా ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.ప్రస్తుతం ఏ దేశంలో చూసినా పీపీఈ కిట్లు, వ్యాక్సిన్‌కు తీవ్రమైన పోటీ వున్నప్పటికీ.

ఆమె ముందు చూపుతో వ్యవహరించారు.వివిధ దేశాల నుంచి పీపీఈ కిట్లు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పాటు 40 కోట్ల వ్యాక్సిన్ డోసులను దిగుమతి చేసుకున్నారు.

అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే.తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.వీరికి ఐర్లాండ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్‌లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.

ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Telugu Anitha Anand, Canada, Corona, Oakville-Telugu NRI

2019 అక్టోబర్‌లో అనిత కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.ట్రూడో కేబినెట్‌లో ఇప్పటికే భారత సంతతికి చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు.కానీ వారు ముగ్గురూ సిక్కులే కావడం విశేషం.ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్‌గా ఆమె సేవలందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube