కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అంటే వెంటనే అనిరుద్ అని చెప్పేస్తారు.చాలా చిన్న వయస్సులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ యంగ్ టాలెంటెడ్ ప్రస్తుతం తమిళ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నాడు.
ఏడాదికి కనీసం నాలుగు, ఐదు సినిమాలకి తక్కువ కాకుండా మ్యూజిక్ అందిస్తున్నారు.ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించాడు అంటే అతని స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఏ.ఆర్.రెహమాన్ శిష్యుడిగా పరిచయం అయిన అనిరుద్ చాలా వేగంగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.అయితే ఈ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ సెన్సేషన్ తెలుగులో సినిమా చేయడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు.
అయితే అతను మ్యూజిక్ అందించిన చాలా తమిళ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవ్వడంతో పాటు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇక ఇందులో అతని మ్యూజిక్ కి కూడా మంచి మార్కులు పడటంతో టాలీవుడ్ లో కూడా అనిరుద్ పేరు అందరికి భాగా రీచ్ అయ్యింది.
ప్రస్తుతం యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రౌడీ బేబీ సాంగ్ కి మ్యూజిక్ అందించింది కూడా అనిరుద్ అనే విషయం అందరికి తెలిసిందే.ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లోకి తీసుకొచ్చాడు.
ఆ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయిన సినిమా ఫ్లాప్ కావడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.తరువాత అరవింద సమేత కోసం ముందుగా అనిరుద్ ని అనుకున్న ఎందుకనో ఫైనల్ గా తమన్ వచ్చి చేరాడు.
అయితే అప్పుడు ఎన్టీఆర్ కి సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం మిస్ అయిన ఇప్పుడు వచ్చింది.ఎన్టీఆర్ సినిమా కోసం కొరటాల అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.