ఎన్టీఆర్ మూవీకి అనిరుధ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది.అనిరుధ్ గతంలో పలు తెలుగు సినిమాలకు సంగీతం అందించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

 Anirudh Remuneration For Ntr Movie Details Here , Anirudh , Datails Here, Ntr Mo-TeluguStop.com

అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన అనిరుధ్ కు ఆ సినిమా రిజల్ట్ భారీ షాకిచ్చింది.ఆ తరువాత జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు.

జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.అయితే తమిళంలో మాత్రం అనిరుధ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది.అయితే ఎన్టీఆర్ సినిమా కొరకు అనిరుధ్ ఏకంగా 4.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.గతంలో తెలుగు సినిమాల కొరకు మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న అనిరుధ్ పారితోషికంను భారీగా పెంచేయడం గమనార్హం.

నిర్మాతలు బేరం ఆడితే అనిరుధ్ ఈ సినిమాకు కనీసం నాలుగు కోట్ల రూపాయలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

తెలుగులో ప్రస్తుతం ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కమర్షియల్ సినిమాలకు ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు.ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి భారీ మొత్తం పారితోషికం తీసుకుంటున్నా కీరవాణి ఆ సినిమా కోసమే సంవత్సరాల తరబడి పని చేస్తున్నారు.

అనిరుధ్ రెమ్యునరేషన్ ఒక విధంగా రికార్డ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Anirudh, Anirudh Ntr, Ntr-Movie

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో సినిమాతో అనిరుధ్ ఖాతాలో సక్సెస్ చేరితే అనిరుధ్ కు కొత్త సినిమా ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.అనిరుధ్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్టు త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube