పెద్ద తలకాయలకు గురి పెడుతున్న అనీల్‌ రావిపూడి  

Anil Ravipudi Want To Direct Young Heros - Telugu Allu Arjun, Anil Ravipudi, Anil Ravipudi In Sarileru Nikevvaru, Anil Ravipudi Latest Update, Chiranjeevi, Ntr, Ram Charan

వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటున్న అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 3 చిత్రంను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఇదే సమయంలో ఆయన స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Anil Ravipudi Want To Direct Young Heros - Telugu Allu Arjun, Anil Ravipudi, Anil Ravipudi In Sarileru Nikevvaru, Anil Ravipudi Latest Update, Chiranjeevi, Ntr, Ram Charan-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంను తెరకెక్కించిన అనీల్‌ రావిపూడి హిట్‌ను కొట్టాడు.దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు యంగ్‌ స్టార్‌ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు ఈ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.ఇటీవలే ఈయన చిరంజీవిని కలిసి ఒక మంచి స్క్రిప్ట్‌ను వినిపించాడట.చిరంజీవికి ఆ స్క్రిప్ట్‌ నచ్చినట్లుగా సమాచారం అందుతోంది.అయితే చిరు ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా కొంత సమయం తర్వాత చేద్దాం అన్నాడట.

అల్లు అర్జున్‌తో కూడా ఈయన చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక మరో వైపు ఈయనతో అఖిల్‌ 4 సినిమాను నిర్మించేందుకు నాగార్జున తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మొత్తానికి అనీల్‌ రావిపూడి జోరు చూస్తుంటే మాత్రం ఇతర దర్శకులు కుళ్లుకుంటూ ఉంటారు.అనీల్‌ రావిపూడి తన తదుపరి చిత్రంగా దేన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అంటూ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు

Anil Ravipudi Want To Direct Young Heros-anil Ravipudi,anil Ravipudi In Sarileru Nikevvaru,anil Ravipudi Latest Update,chiranjeevi,ntr,ram Charan Related....