మెగా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నా..!

పటాస్ టూ సరిలేరు నీకెవ్వరు అతను సినిమా తీస్తే హిట్ అనే క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F2 సీక్వల్ గా వస్తున్న ఎఫ్3 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న F3 మొదటి సినిమాను మించి కామెడీ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

 Anil Ravipudi Waiting For Megastar Chiranjeevi Movie Offer, Anil Ravipudi , Meg-TeluguStop.com

ఇక రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనీల్ రావిపుడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి ప్రస్తావించాడు.

బాలకృష్ణతో సినిమా లైన్ ఓకే అయ్యిందని.

త్వరలోనే ఆ సినిమాకు సంబందించిన అప్డేట్ వస్తుందని చెప్పాడు అనీల్ రావిపుడి.ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు అనీల్.

చిరు సార్ తో పనిచేసే అవకాశం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని అన్నారు.అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ప్లానింగ్ లో ఉందని అన్నారు.

ఎలాగు సక్సెస్ ఫుల్ డైరక్టర్ కాబట్టి చిరు అనీల్ కు అవకాశం ఇవ్వడంలో పెద్దగా వెనుకాడరని చెప్పొచ్చు.  ఇక పవన్ ఛాన్స్ అంటారా పవన్ ఇప్పుడు కమిటైన సినిమాలే చేస్తాడా లేదా అన్న విధంగా పరిస్థితి ఉంది.

మరి అనీల్ కి ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube