బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ కథ.. డైరెక్టర్ ఎవరంటే?

తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా ఓ సినిమా సెట్ లోనే ఉండగానే మరో సినిమా అవకాశాన్ని పొందుతున్నాడు.

 Anil Ravipudi Upcoming Movie With Balakrishna With Powerful Story-TeluguStop.com

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది.

 Anil Ravipudi Upcoming Movie With Balakrishna With Powerful Story-బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ కథ.. డైరెక్టర్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా ఈనెల 28న విడుదల చేయాలని అనుకోగా.కరోనా వైరస్ నేపథ్యంలో విడుదల వాయిదా పడింది.

ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు.యధార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మరో డైరెక్టర్ తో కలిసి మరో సినిమా చేయనున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య సినిమా రానుంది.ఇక బాలకృష్ణ సినిమా అంటే పక్క మాస్ తో పాటు మంచి పవర్ ఫుల్ డైలాగులు, పాటలు, ఫైట్ లు వంటివి ఎక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది.ఇక బాలయ్య సినిమా చేయాలనుకుంటే మంచి కథతో పాటు ఇలాంటి అంశాలు కూడా ఉండాలని అంటున్నాడు అనిల్ రావిపూడి.


అంతే కాకుండా బాలయ్య క్రేజ్ కి తగ్గట్టుగానే కథలు పవర్ఫుల్ గా తీసుకున్నాడట. పటాస్ తరహా వినోదం తోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుందని తెలుపుతున్నాడు.ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మొదలు పెట్టనున్నాడు.కాబట్టి ఈ రెండు సినిమాల తర్వాత అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.

#Powerful Story #Anil Ravipudi #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు