‘NBK108’ క్రేజీ అప్డేట్.. పక్కా తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్ చెబితే..

నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత మరింత ఉత్సాహంగా ఉన్నాడు.

 Anil Ravipudi To Show A New Side Of Balakrishna-TeluguStop.com

ఈ సంక్రాంతి కానుకగా బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పండుగకు పర్ఫెక్ట్ సినిమాగా ఫ్యాన్స్ కు అనిపించింది.

ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపులో బాలయ్య వెంటనే మరో సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.వీరసింహారెడ్డి రిలీజ్ కు ముందే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది అని ప్రకటించారు.NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Telugu Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Nbk, Sreeleela-Movie

అనిల్ రావిపూడి ఇంత వరకు ప్లాప్ అంటే ఏంటో తెలియకుండా వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు.ఇటీవలే ఎఫ్ 3 వంటి సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ వెంటనే బాలయ్యను లైన్లో పెట్టాడు.అనిల్ సినిమా చేస్తే అందులో యాక్షన్ తో పాటు కామెడీ మిక్స్ చేసి ఉంటాయి అనే విషయం తెలిసిందే.అందుకే ఈయన సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టావు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Balakrishna, Nbk, Sreeleela-Movie

అయితే యాక్షన్ సినిమాలలో చూసిన బాలయ్యను కామెడీ వేలో ఎలా నడిపిస్తాడో అని అందరు ఎదురు చూస్తున్నారు.తాజాగా వస్తున్న అప్డేట్ ప్రకారం.అనిల్ బాలయ్య కోసం తెలంగాణ నేపథ్యంలో భారీ యాక్షన్ సబ్జెక్ట్ ను రాసుకున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చేసాడు.మరి దీనిని బట్టి బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ ఎలా చెబుతాడు ఈయన చెబితే ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.మరి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube