ఎఫ్3 గ్యాప్‌లో మరోటి అంటోన్న డైరెక్టర్  

Anil Ravipudi To Direct Small Movie Before F3 - Telugu Anil Ravipudi, F2 Sequel, F3, Tollywood News

టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.ఈ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాల్లో ఎఫ్2 తనకు ఎంత పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెబుతుంటాడు ఈ డైరెక్టర్.

 Anil Ravipudi To Direct Small Movie Before F3

కాగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ కావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశారు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 చిత్రాన్ని తెరకెక్కించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.

ఎఫ్3 గ్యాప్‌లో మరోటి అంటోన్న డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

అటు విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిద్దామని అనడంతో అనిల్ రావిపూడి డైలమాలో పడ్డాడట.దీంతో చేసేదేమీ లేక ఈ గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేసేందుకు రెడీ అవతున్నాడట.

దీని కోసం కథను కూడా రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమాను చిన్న హీరోతో తెరకెక్కించాలని చూస్తున్న అనిల్ రావిపూడి, తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను తీసుకొచ్చి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

మరి అనిల్ రావిపూడి చిన్న సినిమాగా తెరకెక్కించబోయే ఈ సినిమా ఎవరితో చేస్తాడా, అసలు ఎలాంటి సబ్జెక్ట్‌తో ఈ సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఏదేమైనా ప్రస్తుతం ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anil Ravipudi To Direct Small Movie Before F3 Related Telugu News,Photos/Pics,Images..