ఎన్టీఆర్ లైనప్ లో మరో స్టార్ డైరెక్టర్.. ఈ కాంబో కూడా కన్ఫర్మ్ అట!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ఈయన ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

 Anil Ravipudi To Direct Jr Ntr, Jr Ntr, Anil Ravipudi, Koratala Shiva, Prashanth-TeluguStop.com

ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని వార్తలు అయితే వస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరొక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది.కొరటాల తో సినిమా పూర్తి అయినా వెంటనే నీల్ సినిమా స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

మరి ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు ఓకే చేసిన ఎన్టీఆర్ మరొక స్టార్ డైరెక్టర్ ను తన లైనప్ లోకి తెచుకున్నట్టు టాక్.అనిల్ రావిపూడి.

ఈయన వరుస సూపర్ హిట్ లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఈయన ప్రెసెంట్ ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 తీస్తున్నాడు.

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్నాడు.ఇది కూడా పక్కా హిట్ అని గ్యారెంటీగా ఉన్నాడు.

ఈ సినిమా మే 27న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత ఈయన నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది.ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి మరొక గుడ్ న్యూస్ చెప్పాడు.

Telugu Anil Ravipudi, Anilravipudi, Jr Ntr, Koratala Shiva, Prashanth Neel-Movie

ఏంటంటే ఎన్టీఆర్ తో కూడా అనిల్ కథ చర్చలు జరిపారట.ఎఫ్ 3, ఆ తర్వాత బాలయ్య సినిమా పూర్తి అయినా తర్వాత ఎన్టీఆర్, అనిల్ కాంబోలో సినిమా ఉండవచ్చని అంటున్నారు.మరి అనిల్ అయితే తన సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేస్తాడు.కానీ ఇటు ఎన్టీఆర్ డైరెక్టర్ ల వల్ల ఈ సినిమ లేట్ కావొచ్చేమో అంటున్నారు.

మరి అసలు వీరి కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube