ఆ విషయంలో సుకుమార్ సక్సెస్.. మారుతి, అనిల్ ఫెయిల్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్, అనిల్ రావిపూడి, మారుతి వాళ్ల శైలికి అనుగుణంగా సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ దర్శకులు తాము దర్శకులుగా సక్సెస్ కావడంతో పాటు తమ దగ్గర పని చేసిన వారిని దర్శకులుగా పరిచయం చేయడంతో పాటు నచ్చిన కథలను నిర్మించి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

 Anil Ravipudi Super Planning About Future Movies-TeluguStop.com

ఈ ప్రయత్నంలో సుకుమార్ సక్సెస్ అయితే మారుతి, అనిల్ రావిపూడి మాత్రం ఫెయిల్ అయ్యారు.

సుకుమార్ రైటింగ్స్ పేరుతో సుకుమార్ బ్యానర్ ను స్టార్ట్ చేసి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ కుమారి 21 ఎఫ్, ఉప్పెన లాంటి విజయాలను సొంతం చేసుకున్నారు.

 Anil Ravipudi Super Planning About Future Movies-ఆ విషయంలో సుకుమార్ సక్సెస్.. మారుతి, అనిల్ ఫెయిల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతూ సుకుమార్ కు, సుకుమార్ దగ్గర పని చేసిన దర్శకులకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి.గత నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన ఉప్పెన సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

గతంలో మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, మారుతి నేమ్ తో కొన్ని సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో ప్రేమకథాచిత్రమ్, లవర్స్ సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి.మిగిలిన సినిమాలు ఫ్లాప్ కావడంతో మారుతి ఇమేజ్ ఘోరంగా దెబ్బ తిని మారుతి అలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే తాజాగా అనిల్ రావిపూడి పేరు ఉపయోగించుకొని విడుదలైన గాలిసంపత్ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

Telugu Anil Ravipudi, Future Movies, Maruthi, Sukumar-Movie

దర్శకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.అనిల్ రావిపూడి బ్రాండ్ నేమ్ తో వేరే సినిమాలు విడుదలై ఆ సినిమాలు సక్సెస్ కాకపోతే అనిల్ రావిపూడి సినిమాల బిజినెస్ పై కూడా ఆ ప్రభావం పడింది.అనిల్ రావిపూడి భవిష్యత్తులో ఇతర సినిమాలకు తన బ్రాండ్ నేమ్ ఇస్తారా.? ఇవ్వరా.? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

#Future Movies #Maruthi #Sukumar #Anil Ravipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు