అనుకున్నదే అయ్యింది.. సీక్వెల్ కంటే ముందే దిగుతున్న డైరెక్టర్!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ఈ ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అనిల్ రావిపూడి క్రేజీ డైరెక్టర్స్‌లో ఒకడిగా మారిపోయాడు.

 Anil Ravipudi New Movie Details Soon, Anil Ravipudi, Sarileru Neekevvaru, Mahesh-TeluguStop.com

ఇక తనకు ఇంతటి బ్రాండ్‌ను తీసుకొచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తానని అనిల్ రావిపూడి గతంలోనే తెలిపాడు.

అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించేందుకు చాలా సమయం పట్టేటట్లు ఉండటంతో ఎఫ్3 చిత్రం మరింత ఆలస్యం అవుతోంది.

ఇప్పటికే స్క్రిప్టు పనులు ముగించుకున్న అనిల్ రావిపూడి, వెంకటేష్ కోసమే ఎదురుచూస్తున్నాడట.అయితే వెంకీ ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా నారప్ప మీదనే పెట్టడంతో ఆ సినిమాను పూర్తి చేశాకే ఎఫ్3లో పాల్గొంటానని తేల్చి చెప్పాడట.

దీంతో అనిల్ రావిపూడి, ఈ మధ్యలో ఓ చిన్న సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఓ మీడియం రేంజ్ హీరోతో ఈ సినిమాను వీలైనంత త్వరగా తెరకెక్కించి రిలీజ్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరి ఈ సినిమాలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube